కేసీఆర్ కున్న ఇమేజ్ యాంటిపూర్: షర్మిల

వైఎస్ షర్మిల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. మీ స్కాంలు బయట పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి చిన్న దోర అంటూ ట్విట్‌ చేశారు. మీ తండ్రి కాలేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల స్కాం.. మీ చెల్లి చేసిన లిక్కర్ స్కాం.. మీరు రియలెస్టేట్ స్కాం చేయలేదని ఇవన్నీ బయటపెట్టే దమ్ము మీకుందా అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.

New Update
కేసీఆర్ కున్న ఇమేజ్ యాంటిపూర్: షర్మిల

KCR Kunna Image Antipur Sharmila

తెలంగాణలో నక్కకు, నాగలోకానికి ఎంత తేడా ఉందో వైఎస్ఆర్ పాలనకు, కేసీఆర్ పాలనకు అంత తేడా ఉందని వైఎస్ఆర్టీపీ షర్మిల విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. చిన్న దొర కేటీఆర్.. వైఎస్ఆర్ ఇమేజ్ ప్రోపూర్, ప్రో ఫార్మర్, ప్రో అగ్రికల్చర్ అయితే.. కేసీఆర్ కున్న ఇమేజ్ యాంటి పూర్, కేసీఆర్ ఒక యాంటీ ఫార్మర్, కేసీఆర్ పాలన యాంటి యూత్, కేసీఆర్ ప్రభుత్వం యాంటీ ఉమెన్, కేసీఆర్ అంటే యాంటీ మైనారిటీస్, కరప్షన్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కరప్షన్ అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రం సమతుల్య అభివృద్ధి అని మంత్రి కేటీఆర్ చెప్తున్నారని, ఈ సందర్బంగా కేటీఆర్‌కు ఒక ఛాలెంజ్ చేశారు. మీ తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కాం, మీ చెల్లి కవిత లిక్కర్ స్కాం, మీరు రియలెస్టేట్ స్కాం చేయలేదని, మీరు సుద్దపూసలని నిరూపించుకునే దమ్ముందా? అంటూ కేటీఆర్‌కు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు