Congress Declaration: యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే: రేవంత్‌రెడ్డి రీట్వీట్

కేటీఆర్- రేవంత్‌రెడ్డి మధ్య ట్వీట్ వార్‌ నడుస్తోంది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఒక్కటే నని. త్వరలో సీఎం కేసీఆర్ ఖేల్ ఖతం..బీఆర్ఎస్‌ దుఖాన్‌ బంద్‌ అని రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

Congress Declaration: యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే: రేవంత్‌రెడ్డి రీట్వీట్
New Update

Telangana Congress Declaration: టీకాంగ్రెస్‌ విడుదల చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ( SC, ST Declaration)పై తెలంగాణలో రచ్చ నడుస్తోంది. అధికార పార్టీ నాయకులు వరస పెట్టి మరి స్పందిస్తూ కౌంటర్స్‌ ఇస్తున్నారు.ఈ డిక్లరేషన్‌పై ముందుగా మంత్రి కేటీఆర్‌ (KTR)స్పందిస్తూ..అది డిక్లరేషన్‌ సభ కాదు.. అధికారం రానే రాదనే ఫ్రస్ట్రేషన్‌ సభ అని ఐటీ శాఖ మంత్రి విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తరువాత కూడా..ఎస్సీ, ఎస్టీ వెనకబడి ఉన్నారంటే..దానికి కారణం...ప్రధాన దోషే..కాంగ్రెస్ పార్టీ.. దళిత, గిరిజన బిడ్డలకు.. కాంగ్రెస్ చేసిన దశాబ్దాల పాపమే..ఆ పార్టీని మరో వందేళ్లయినా శాపంలా.. వెంటాడుతూనే ఉంటుందని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. మంత్రి హరీష్‌రావు (Harish rao) స్పందిస్తూ ఖర్గే సొంత రాష్ట్ర కర్ణాటకలో మొదట డిక్లరేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రారని హరీష్‌రావు అన్నారు. బీఆర్ఎస్ నాయకుల స్పందనపై రేవంత్‌రెడ్డి రీ ట్వీట్‌ ( Revanth Reddy Retweet)  చేశారు.

దళితుడ్ని సీఎం మోసం చేశారు

టీకాంగ్రెస్‌ ఇటీవల డిక్లరేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దళిత - గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్.దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు.ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదా?.గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదు. మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదు. నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత-బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదు. దళిత -గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదని కేటీఆర్‌ ట్వీట్‌కు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.

ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు

దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేయించడం లాంటిది కాదు. ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదు.ఎబీసీడీ వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కాదు.దళితబంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.అందుకే…యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే “కేసీఆర్ ఖేల్ ఖతం-బీఆర్ఎస్ దుకాన్ బంద్” జై కాంగ్రెస్ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Also Read: బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొడుతుంది: MLA Danam

#revanth-reddy-retweet #pcc-chief-revanth-reddy #brs-dukhan-bund #kcr-khel-khatam #telangana-congress-declaration-war #kcr #telangana-election-2023 #telangana-congress-declaration #congress-declaration
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe