Khammam: హరీష్‌రావు వద్దకు నేతలు క్యూ.. ఫోకస్ అంతా ఖమ్మంపైనే తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ హవా నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా సీఎం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఉన్న సీట్ల మొత్తం కాంగ్రెస్ సొంత చేసుకోవటం ఖాయమని పొంగులేటి చెబుతున్నారు. ఈ సవాల్‌పై.. కేసీఆర్ ఫోకస్‌తో.. జిల్లా నేతలు భాగ్యనగర్‌కు క్యూ కట్టారు. ఏం చేస్తారో అనేది ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. By Vijaya Nimma 20 Aug 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి ఇన్‌ఛార్జీగా బాధ్యతలు ఉమ్మడి ఖమ్మంపై కేసీఆర్ ఫోకస్‌పెట్టారు. జిల్లా ఇన్‌ఛార్జీగా హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో అపాయింట్‌మెంట్ నేతలకు దొరికటం లేదు. మంత్రి హరీష్‌రావు వద్దకు క్యూ కట్టారు ఖమ్మం జిల్లా అసంతృప్త, అసమ్మతి నేతలు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు జరగబోతుండటంతో.. రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన మాజీమంత్రి తుమ్మల. ఇక టికెట్ విషయంలో అటో.. ఇటో తేల్చుకునే వస్తానంటూ క్యాడర్‌కు సంకేతాలు ఇచ్చారు. పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ తుమ్మల నాగేశ్వరరావు ఆశిస్తున్నారు. క్యూ కట్టిన నేతలు ఈ రోజు ఉదయమే తన వర్గం నేతలతో కలిసి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హైదరాబాద్‌కు చేరుకున్నారు. అసమ్మతి నేతల వ్యవహారంపై హరిప్రియ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇల్లందు నుంచి టికెట్ నిజాంలా కళాశాల ప్రిన్సిపాల్.. కమ్యూనిస్టు నేత మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తనయురాలు గుమ్మడి అనురాధ ఆశిస్తున్నారు. ఇక వైరాలో సోషల్ వార్‌పై మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ హరీష్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యవహారంపై యాక్షన్ తీసుకోవాలని ఇరువురు నేతలతో మంత్రి హరీష్‌రావుకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఇన్‌చార్జీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతామధు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. జిల్లా రాజకీయాలపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి సమాచారం అందిస్తున్నారు. టికెట్ కోసం నిరసన దీక్షకు సిద్ధం కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టికెట్ తనదేనంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాత్రం ఆశలు కోల్పోయారనే చెప్పాలి. సీఎం కేసీఆర్ ఫోన్ కాల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. టికెట్ ఆశిస్తూ గడప.. గడపకు గడల అంటూ కొత్తగూడెం చేరుకున్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాస్‌రావుకు అధిష్టానం మద్దతు తనకే ఉందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మధిర నుంచి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారుల కోటాలో మధిర టికెట్ బొమ్మెర రామ్మూర్తి ఆశిస్తున్నారు. మధిర టికెట్ కేటాయించాలంటూ బొమ్మెర రామ్మూర్తి నిరసన దీక్షకు దిగే అవకాశం కూడా కనిపిస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి