Kavitha Will Be Arrested Soon: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే(Ashwini Kumar Choubey) సీఎం కేసీఆర్(CM KCR)పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ సర్కార్ లిక్కర్ స్కామ్, కరప్షన్ మీద పడిందని అన్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(CM Kejriwal)తో కలిసి సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును కాజేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్, కేసీఆర్ ఇద్దరూ దొంగలే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నరకంగా మార్చారు అని అన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత(Kavitha) లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుందని పేర్కొన్నారు. ఇవ్వాళో, రేపో.. ఆమెకు శిక్ష పడటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత జైలుకు వెళ్లాడాన్ని ఎవరూ ఆపలేరు.. ఆమెను ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు.
Also Read: విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు!
తెలంగాణలో చీకటి రోజులు పోయి మంచి రోజులు వస్తాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ(BJP) అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారని.. దాన్ని కచ్చితంగ నెరవేరుస్తారని అన్నారు. గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్ 100 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. మిషన్ భగీరథ పథకంలో కూడా కమీషన్లు తీసుకున్నారని విమర్శించారు. 24 గంటలు నీళ్లు వస్తాయని కేసీఆర్ చెప్పారని.. ఇప్పుడు 4 గంటలు కూడా సరిగ్గా నీళ్లు రావడం లేదని విమర్శించారు.
Also Read: కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం!
కేసీఆర్ సర్కార్ తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా తయారు చేశారని మండిపడ్డారు. యువకులు కూడా లిక్కర్‌కు బానిసలుగా మారుతున్నారని అన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. సింగరేణిని కూడా ఆగం చేశారని.. దళిత బంధు ఇస్తామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఫైర్ అయ్యారు. కల్యాణా లక్ష్మీ, డబుల్ బెడ్రూం ఇండ్ల హామీ కూడా నెరవేర్చలేదని.. ప్రతీ స్కీమ్‌లో 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని తెలిపారు. ధరణి పోర్టల్ యోజన ద్వారా భూములు లాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని అన్నారు.