/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-26T103011.985-jpg.webp)
Katrina Kaif: బాలీవుడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్ తన జీవితంలో ఎదురైన ఓ భయంకరమైన సంఘటనను అభిమానులతో షేర్ చేసుకుంది. అమ్మనాన్నలు, దేవుడు కల్పించిన అదృష్టం వల్లే ఈ రోజు ప్రేక్షకుల ముందు ఉన్నానని, లేదంటే ఎప్పుడో మట్టిలో కలిసిపోయేదానినంటూ ఎమోషనల్ అయింది. సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన కత్రిన నటించిన తాజా చిత్రం 'టైగర్ 3' (Tiger 3). ఇటీవల విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొంటున్న కత్రిన (Katrina Kaif) రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరీర్ అండ్ పర్సనల్ విషయాల గురించి మాట్లాడింది.
'నా జీవితంలో ఒక భయంకరమైన సంఘటన చూశాను. చావు అంచు వరకు వెళ్లి బ్రతికి బయటపడ్డాను. ఒకసారి హెలికాఫ్టర్ లో ప్రయాణం చేస్తూ ఉండగా దానికి ఏదో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ చాలా వేగంగా నేలవైపు దూసుకొచ్చింది. అది చూసి నేను ఈరోజు చనిపోవడం ఖాయమే అని ఫిక్స్ అయ్యాను. నా చావు ఏంటి దేవుడా ఇలా రాశావు అంటూ బాధపడ్డాను. ఇంత ఘోరంగా చనిపోబోయేలా చేశావు ఎందుకు దేవుడా అంటూ ప్రార్థించాను. నాకు ఏమైనా నా తల్లితండ్రులు ధైర్యంగా ఉండాలని మాత్రమే ఆ క్షణం కోరుకున్నా. నాతోపాటు అందులో ఉన్న వారందరూ కూడా చాలా కంగారు పడ్డారు' అని చెప్పింది. అయితే భగవంతుని దయతో హెలికాప్టర్ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని, పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపింది. చావునుంచి తమను బయటపడేసిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నామని క్రతిన చెప్పారు. చివరగా చావు అంటే ఎలా ఉంటుందో దగ్గరనుంచి చూశాను. నిజంగా చావు అంచుల వరకు వెళ్లి వెనక్కి వచ్చిన ఆ క్షణం ఎప్పటికీ మరిచిపోలేనంటూ చెప్పుకొచ్చింది.
Also read : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య? ఏబీ డివిలియర్స్ ఏమన్నారంటే
అలాగే విక్కీ కౌళల్ తో పెళ్లి తర్వాత తన జీవితం మరింత అందంగా మారిందని, 20 ఏళ్ల సినీ జీవితంలో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఇన్నేళ్ల జర్నీలో తనతో తానే పోటీ పడ్డాను. ప్రతి సినిమాలో నా నటన నేనే పొల్చుకుంటా. బాగా చేశానా? లేదా? అని టెస్ట్ చేసుకుంటా. నా దృష్టి ఎల్లప్పుడూ పనిపైనే ఉంటుంది. ఇతర ఆలోచనలు డిస్ట్రబ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటా. రెస్ట్ తీసుకోవడం పెద్దగా ఇష్టపడను అని తెలిపారు కత్రినా కైఫ్.