Srisailam Temple: శ్రీశైలం వెళ్తున్నారా..అయితే ఈ విషయాలను గమనించండి

దీపావళి అయిందంటే చాలు ఇక తెల్లవారి నుంచి కార్తికమాసం మొదలు. నా కార్తీక సమోమాస: అని లోకోక్తి. అంటే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం.

Srisailam Temple: శ్రీశైలం వెళ్తున్నారా..అయితే ఈ విషయాలను గమనించండి
New Update

Kartika Masam: ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్తికమాసం మళ్లీ డిసెంబర్ 12వ తేదీ అమావాస్యతో ముగుస్తుంది. కార్తికం శివకేశవులకు ప్రీతికరమైన మాసం. ఈ నెలరోజులు శివుడు, విష్ణువుల ఆయాలు భక్తులతో కిక్కిరిసిపోతుంటాయి. ఇక పుణ్యక్షేత్రాల సంగతైతే చెప్పనక్కర్లేదు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మాసంలో వచ్చే ప్రముఖమైన రోజులు, సెలవు రోజులు, పండుగ రోజులలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలోఉంచుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలను, ప్రశాంతమైన దర్శనాలను కల్పించేందుకు దేవస్థానం అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు.

ఆర్జిత అభిషేకాలు వంటివి పూర్తిగా రద్దు

ఈ మాసంలో శ్రీశైలంలో భక్తులరాక అధికంగా ఉంటుంది. అందుకని గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు, వృద్ధ మల్లికార్జునస్వామి ఆర్జిత అభిషేకాలు వంటివి పూర్తిగా రద్దు చేస్తున్నారు. అంతేకాదు శని, ఆది, సోమవారాల్లో మల్లికార్జునస్వామిది అలంకార దర్శనమే ఉండనుంది. అంతేకాకుండా ఎవరైనా స్వామివారి స్పర్శ దర్శనం కావాలనుకుంటే టికెట్లను దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. కాగా.. ఆర్జిత రుద్రహోమం, చండీహోమాలను రోజుకు రెండు విడతలుగా నిర్వహించనున్నారు.

ముందుగానే అన్నీ బుక్ చేసుకుని వెళ్లడం మంచిది

ఇక కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది కార్తిక దీపారాధన. దీపదానాలు. అందుకోసం దీపాలను ఎక్కడపడితే అక్కడ వెలిగించకుండా కేవలం ఆలయ ఉత్తర మాడ వీధిలో భక్తులు దీపాలు వెలిగించుకోవాలని అధికారులు సూచించారు. 27వ తేదీన కార్తీక పౌర్ణమి కావడం.. 26న పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారె సమర్పణతోపాటు ఆరోజున సాయంత్రం ఎప్పుడూ ప్రముఖంగా నిర్వహించే జ్వాలాతోరణ మహోత్సవాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి కార్తికమాసంలో శ్రీశైలం వెళ్లాలని అనుకునే భక్తులు పై విషయాలను గ్రహించి దర్శనాలు, వసతి ముందుగానే అన్నీ బుక్ చేసుకుని వెళ్లడం బెటర్.

ఇది కూడా చదవండి: మీ ఫిట్‌నెస్‌కి మిల్లెట్స్ చేసే మేలు అంతా ఇంతాకాదు.. బోలెడు ప్రయోజనాలు తెలుసా..!!

#ap #srisailam-tempul #kartika-samasam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe