Karthikeya 2 Movie : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ 2' ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ గత ఏడాది ఆగస్టులో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. ఇక తాజాగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది.
70వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచింది. దీంతో మూవీ టీమ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. నిజానికి ఈ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని ఆడియన్స్ కూడా ఊహించలేదు. అయితే 'కార్తికేయ 2' కు నేషనల్ అవార్డు రావడానికి ప్రధాన కారణం ఈ సినిమా కథా, కథనం.. డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాతో శ్రీకృష్ణుడి తత్వాన్ని నేటి తరానికి కళ్లకు కట్టినట్లు చూపించారు.
Also Read : ఏకంగా రెండు ఓటీటీల్లో ‘కల్కి’.. డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
ప్రతి ప్రశ్నకు ఓ సమాధానం ఉంటుందని, దానిని అన్వేషించడానికి ఎంతదూరమైన వెళ్లాలనే బలమైన సంకల్పం ఉన్న యువకుడు కార్తికేయ చేసిన సాహసభరితమైన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. కృష్ణుడి చరిత్ర చుట్టూ ద్వారక నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ ఆద్యంతం ఆధ్యాత్మికత, థ్రిల్లింగ్ అంశాల కలబోతగా ఈ సినిమా సాగుతుంది. అందుకే నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
సినిమాలో శ్రీకృష్ణుడి రిఫరెన్స్ సీన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారు. ఆ సీన్స్ లో ప్రతీ ఫ్రేమ్, టేకింగ్, సినిమాటోగ్రఫీ ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ముఖ్యంగా బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి గురించి చెప్పే డైలాగ్స్, బీజేయం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తంగా శ్రీకృష్ణుడి చరిత్రను నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పిన 'కార్తికేయ 2' టీమ్ ఇలాంటి అవార్డ్స్ కు కచ్చితంగా అర్హులని చెప్పొచ్చు.