/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-46-1.jpg)
Karthika Deepam Serial Fame Premi Vishwanath's Son : కార్తీక దీపం సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు ఎంతో దగ్గరైంది ప్రేమి విశ్వనాథ్. సీరియల్ లో వంటలక్క గా అద్భుత నటన కనబర్చి ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగు ఆడియన్స్ అయితే ఆమె అసలు పేరు వదిలేసి 'వంటలక్క' పేరుతోనే పిలవడం మొదలు పెట్టారు. ప్రేమి విశ్వనాధ్ కూడా అదే క్రేజ్ ను కంటిన్యూ చేస్తుంది. మలయాళ నటి అయిన ఈమెకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారనే విషయం తెలిసిందే.
అయితే ప్రేమి విశ్వనాధ్ కు ఓ కొడుకు కూడా ఉన్నాడు. గతంలో తన కొడుకుతో ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవల మరోసారి తన కొడుకుతో రీల్ చేసి పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ రీల్ లో తన కొడుకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా యాడ్ చేయడంతో అతని అకౌంట్ ని కూడా చూస్తున్నారు నెటిజన్లు.
Also Read : ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఫిక్స్ అయిందా?
అతని పేరు మనుజిత్. అతను ఏం చదువుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియకపోయినా కండల వీరుడు అని మాత్రం అర్ధమవుతుంది. అతని సోషల్ మీడియా అకౌంట్ అంతా జిమ్ కి సంబంధించిన ఫొటోలు, కండలతో అతని బాడీ చూపించే ఫొటోలే ఉన్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ అంతా వంటలక్క కొడుకు స్టార్ హీరోలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram