Karthika Deepam: 'కార్తీక దీపం' నవ వసంతం.. మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వంటలక్క, డాక్టర్ బాబు

యాక్టర్ నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ లీడ్ రోల్స్ లో అలరించిన 'కార్తీక దీపం' మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కార్తీక దీపం (ఇది నవ వసంతం) అనే పేరుతో త్వరలో సీజన్ 2 ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.

Karthika Deepam: 'కార్తీక దీపం' నవ వసంతం.. మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వంటలక్క, డాక్టర్ బాబు
New Update

Karthika Deepam Serial: బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ప్రసారం అవుతాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందులో మొదటి స్థానంలో ఉంటుంది 'కార్తీక దీపం'. అప్పట్లో స్టార్ మా (Star Maa) ప్రసారమైన ఈ సీరియల్ విపరీతమైన ప్రజాదరణ పొందింది. దేశంలోనే అత్యధిక Trp రేటింగ్ తో సంచలనం సృష్టించింది ఈ సీరియల్. డాక్టర్ బాబు, వంటలక్క (Vantalakka), సౌందర్య, మోనిత పాత్రలు ఎప్పటికీ గుర్తుంటాయి. వాళ్ళ రియల్ పేర్ల కంటే రీల్ నేమ్స్ ఎక్కువగా పాపులర్ అయ్యాయి.

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్ 

2017 అక్టోబర్ నుంచి ప్రారంభమైన ఈ సీరియల్ 2022 వరకు టాప్ రేటింగ్ తో ప్రేక్షకులను అలరించింది. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన కార్తీక దీపం సీరియల్ కు 2023 లో ఎండ్ కార్డు పండింది. దీనిలోని పాత్రలకు ఎంతగానో కనెక్ట్ అయిన ప్రేక్షకులు సీరియల్ అయిపోవడంతో చాలా బాధపడ్డారు. సీక్వెల్ వస్తే బాగుండు అని అనుకున్నారు. ఇక ఇప్పుడు ప్రేక్షకుల కోరికకు తెర పడింది. కార్తీక దీపం సీరియల్ సీక్వెల్ వచ్చేస్తుంది. ఈ విషయాన్నీ తెలియజేస్తూ తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది స్టార్ మా. కార్తీక దీపం (ఇది నవ వసంతం) అంటూ టైటిల్ ను రివీల్ చేశారు.

కార్తీక దీపం ప్రోమో

ఇంటి ఓనర్ గా నిరూపమ్ (Nirupam) , ఆ ఇంట్లో వంటలక్కగా ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath) కనిపించారు. శౌర్య పాత్రలో చిన్న పిల్లను చూపించారు. తండ్రి ప్రేమకు దూరమైనా ఆ చిన్న పాప.. నాకు అమ్మైనా, నాన్నైనా మా అమ్మనే అంటూ వంటలక్కను చూపిస్తుంది. ఆ చిన్నారి ఆవేదనతో నిరూపమ్ గుండె బరువెక్కిపోతుంది. ఇలా ప్రోమో ఆసక్తిగా కనిపించింది. కార్తీక దీపం (నవ వసంతం) అనే పేరుతో పాత పాత్రలనే సరికొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారి కార్తీక దీపం (Karthika deepam Serial) ఏ రేంజ్ ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read : Director Yashasvi : ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్

#karthika-deepam #karthika-deepam-serial #karthika-deepam-serial-season-2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe