ఒక్కసారిగా పైకి దూసుకొచ్చిన ఏనుగు, భయపడిన బస్ ప్రయాణికులు నిత్యం సోషల్‌మీడియాలో ఏదో ఒక వింత ఘటనకు సంబంధించిన చాలా వీడియోలను మనం చూస్తూనే ఉంటాం.. అందులో ఒకటి భయానకం అయితే.. మరొకటి ఆనందపరిచే వీడియోలు ఉంటాయి. అయితే ఇక్కడ వీడియోలో మాత్రం ఓ ఏనుగు బస్‌కు ఎదురుగా వచ్చి అందులోని ప్రయాణికులను హడల్ ఎత్తించింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను (Viral Video)పోస్ట్ చేశారు. By Shareef Pasha 24 Jul 2023 in Scrolling వైరల్ New Update షేర్ చేయండి సోషల్‌మీడియాలో నిత్యం ఎవరో ఒకరు ఏదో ఒక ఇంట్రెస్ట్రింగ్ వీడియోలను(Interesting Videos) షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా.. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు (IAS Officer Supriya Sahu)తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో ఆసక్తికర వీడియోను (Viral Video) పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డు పక్కన ప్రయాణీకులతో నిండుగా ఉన్న ఓ బస్ (Bus) వైపు గజరాజు (Elephant) దూసుకురావడం కనిపిస్తుంది. ఏనుగు అక్కడి నుంచి వెళ్లే వరకూ బస్ వేచి ఉండటం ఈ వైరల్ క్లిప్‌లో మనం చూడొచ్చు. దూరం నుంచే బస్సును గమనించిన ఏనుగు.. వాహనం వైపు వేగంగా దూసుకొచ్చింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన వారంతా లక్కంటే మీదే భయ్యా అంటూ కామెంట్లు (Comments) చేస్తున్నారు. ట్విట్టర్‌లో రాసుకొచ్చిన ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు When the tusker decided to check out passengers in the bus, everyone led by the bus driver displayed nerves of steel, a great sense of calm and understanding and everything went off well. Video - in Karnataka. Shared by a friend. #coexistence #peopleforelephants pic.twitter.com/OJG4uPRvoi— Supriya Sahu IAS (@supriyasahuias) July 24, 2023 ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్‌లో ఇలా రాసుకొచ్చింది. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను తనిఖీ చేయాలని ఏనుగు (Elephant)నిర్ణయించుకున్నప్పుడు బస్సు డ్రైవర్ (Driver) నేతృత్వంలోని ప్రయాణికులు(Passengers) సేఫ్‌లో ఉన్నారంటూ ఆమె ఫన్నీ(Funny)గా రాసింది. గొప్ప ప్రశాంతత, అవగాహన, ప్రతిదీ బాగా జరిగింది. ఈ వీడియో కర్ణాటక రాష్ట్రం (Karnataka State) నుండి తన స్నేహితుడి ద్వారా కాపీ చేసుకొని పోస్ట్ (Post) చేశానని రాసుకొచ్చింది. అయితే ఏనుగు బస్‌కు, ప్రయాణీకులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్లడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బస్‌లో ఏం జరుగుతుందన్నది పరిశీలిస్తూ ఏనుగు తన దారిన తాను వెళ్లిపోయింది. ఏనుగు వెళుతుండగా బస్ డ్రైవర్‌తో పాటు ప్రయాణీకులు మౌనంగా ఉండటంతో అది ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు సృష్టిలో సమస్త జీవరాసులు సంయమనంతో పాటిస్తాయి అనేందుకు ఇంతకన్నా మంచి ఉదాహరణ మరొకటి ఉండదు. బస్‌లో ప్రయాణీకులను చెక్ చేస్తూ ఏనుగు ముందుకు సాగుతుంది. బస్ డ్రైవర్ సహా ప్రయాణీకులందరూ కామ్‌గా ఉంటూ పరిస్ధితిని అర్ధం చేసుకుని ప్రవర్తించడంతో అంతా సాఫీగా సాగిందని వీడియోకు క్యాప్షన్ (Caption) ఇచ్చారు. కర్నాటకలో జరిగిన ఈ ఘటనను ఫ్రెండ్ షేర్(Friend Share) చేశారని రాసుకొచ్చారు. మనం ఏ జీవరాసినైనా.. డిస్ట్రబ్ చేయకుంటే అవి కూడా మనల్ని డిస్ట్రబ్ (Disturb)చేయవని ఓ యూజర్ (User) రాసుకొచ్చారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి