karnataka: ప్రైవేటు సంస్థల్లో స్థానికుల రిజర్వేషన్‌ బిల్లును నిలిపివేసిన కర్ణాటక సర్కార్..

కర్ణాటకలోని ప్రైవేట్‌ రంగంలో కన్నడిగులకు 50 శాతం మేనేజ్‌మెంట్ స్థానాలకు, 75 శాతం నాన్‌ మేనేజ్‌మెంట్ స్థానాలకు రిజర్వేషన్ కల్పించేలా కేబినేట్ బిల్లును ఆమోదించిన కొన్ని గంటలకే పరిశ్రమల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్ర సర్కార్‌ ఈ బిల్లును హోల్డ్‌లో పెట్టింది. 

New Update
karnataka: ప్రైవేటు సంస్థల్లో స్థానికుల రిజర్వేషన్‌ బిల్లును నిలిపివేసిన కర్ణాటక సర్కార్..

కర్ణాటకలోని ప్రైవేట్‌ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆయా పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ రిజర్వేషన్‌ బిల్లును నిలిపివేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టకముందు దీన్ని మరోసారి పరిశీలిస్తామని ప్రకటించింది. ప్రైవేట్‌ రంగంలో కన్నడిగులకు 50 శాతం మేనేజ్‌మెంట్ స్థానాలకు, 75 శాతం నాన్‌ మేనేజ్‌మెంట్ స్థానాలకు రిజర్వేషన్ కల్పించేలా కేబినేట్ బిల్లును ఆమోదించిన కొన్ని గంటలకే.. రాష్ట్ర సర్కార్‌ ఈ బిల్లును హోల్డ్‌లో పెట్టింది.

Also read: భారీ ఎన్‌ కౌంటర్‌..12 మంది మావోలు మృతి!

అయితే కర్ణాటక కేబినేట్ తీసుకున్న ఈ నిర్ణయం కన్నడిగులకు అనకూలమని సీఎం సిద్ధరామయ్య చెప్పినప్పిటికీ.. పలు ఐటీ ఇండస్ట్రీల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ బిల్లు వల్ల బెంగళూరులో టెక్‌ ఇండస్ట్రీ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని.. ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు