Karnataka: కాలేజీ క్యాంపస్లో కార్పొరేటర్ కూతురు హత్య! కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలో ఘోర మర్డర్ జరిగింది. బీవీబీ కాలేజీలో చదువుతున్న ఫయాజ్ అనే యువకుడు తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో అదే కాలేజీలో చదువుతున్న కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహను కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 18 Apr 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Murder: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ పేరుతో యువతి ప్రాణం తీశాడు. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు అదే బీవీబీ కాలేజీలో చదువుతున్న యువతిని పట్టపగలే కాలేజీ క్యాంపస్ లో అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. Traumatic news coming from #Karnataka's Hubballi Congress corporator's daughter killed in broad daylight inside her college campus! Unable to tolerate Neha Hiremath rejecting his proposal, Fayaz studying in the same college confronted her inside campus & brutally stabbed her… pic.twitter.com/SLXfZPeiwT — Nabila Jamal (@nabilajamal_) April 18, 2024 ప్రేమని నిరాకరించిందనే కోపంతో.. అయితే బాధితురాలు కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహగా గుర్తించారు. ఆమెకు సీనియర్ అయిన ఫయాజ్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. నేహ అతని ప్రేమని నిరాకరించడంతో కోపం పెంచుకున్న అతను యువతి మెడపై విచక్షణరహితంగా తొమ్మిది సార్లు కత్తితో పొడిచి హతమార్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. #corporators-daughter-killed #karnataka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి