ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు సిద్దరామయ్య కీలక నిర్ణయం.... ఇకపై ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు...!

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫేన్ న్యూస్ కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో రాష్ట్ర స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ను గుర్తించి, వాటిని ప్రసారం చేసే వారిని కఠినంగా శిక్షించనున్నారు.

New Update
ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు సిద్దరామయ్య కీలక నిర్ణయం.... ఇకపై ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు...!

Siddaramaiah Approves State-level Fact check: కర్ణాటక సీఎం సిద్దరామయ్య(Sidda Ramaiah) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫేక్ న్యూస్(Fake news) కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని(Special unit) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో రాష్ట్ర స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ (Fact Check Unit) ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ను గుర్తించి, వాటిని ప్రసారం చేసే వారిని కఠినంగా శిక్షించనున్నారు.

రాష్ట్ర స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు సీఎం సిద్దరామయ్య ఆమోదం తెలిపారు. సంబంధిత శాఖకు చెందిన అధికారులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... సమాజంలో పోలరైజేషన్ కు ఫేక్ న్యూస్ ప్రధాన కారణమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తప్పుడు వార్తలను అరికట్టేందుకు నిబంధనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఫేక్ న్యూస్ ను గుర్తించి వాటిని వ్యాప్తి చేసే సిండికేట్‌లను గుర్తించడం, నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించడం, అలాంటి నేరాలకు పాల్పడే వారిని దోషులుగా పరిగణించి కఠిన శిక్షలు విధించడం వంటి మూడు స్థాయిలో సమస్యను పరిష్కరించాలన్నారు.

ఫాక్ట్ చెక్ యూనిట్‌లో పర్యవేక్షక కమిటీ, నోడల్ అధికారులు, నిజనిర్ధారణ కమిటీ సామర్థ్యాన్ని పెంపొందించే బృందం వంటి విభాగాలు ఉండే అవకాశం ఉన్నట్టు తెులస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్ ఫేక్ న్యూస్ లను ఎంతగా ఉపయోగిస్తున్నారో మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ సమావేశంలో ప్రస్తావనకు తీసుకు వచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు నకిలీ వార్తలను గుర్తించడం చాలా ముఖ్యమని అన్నారు. దానికి ఐటీ/బీటీ శాఖ సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు.

Also Read: వైద్యులకు ఎన్ఎంసీ కొత్త రూల్స్..ఉల్లంఘిస్తే 3 నెలలపాటు లైసెన్స్ రద్దు..!!

Advertisment
తాజా కథనాలు