ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు సిద్దరామయ్య కీలక నిర్ణయం.... ఇకపై ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటు...!
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఫేన్ న్యూస్ కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో రాష్ట్ర స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి రాష్ట్రంలో ఫేక్ న్యూస్ ను గుర్తించి, వాటిని ప్రసారం చేసే వారిని కఠినంగా శిక్షించనున్నారు.