Karimnagar: ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఆత్మహత్యకు దారి తీసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇన్స్టాలో పరిచయంతో ఓ వ్యక్తిని ప్రేమించింది అఖిల అనే యువతి. కొంత కాలం వీరిద్దరూ మంచిగా ఉన్నారు. అయితే, ఏమైందో తెలియదు కానీ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. తీవ్ర మనస్తాపానికి గురైన అఖిల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పూర్తిగా చదవండి..Also Read: ముద్దు పెడితేనే అటెండెన్స్.. లేడీ టీచర్లతో హెడ్మాస్టర్ చిల్లర వేషాలు.!
తన చావుకు వాడే కారణమంటూ సూసైడ్ నోట్ రాసింది యువతి అఖిల. దీంతో తమ కూతురు చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురిని తమకు దూరం చేసిన వాడిని ఎట్టి పరిస్థితిలోనూ వదలొద్దంటూ తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.
[vuukle]