హేమకు మంచు విష్ణు ఊహించని షాక్.. 'మా' నుంచి ఔట్? కరాటే కళ్యాణి హేమ పై కీలక వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో ఇలా డ్రగ్స్ కేసులు నమోదవ్వడం బాధాకరమని చెప్పిన ఆమె, ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన హేమ 'మా అసోసియేషన్' సభ్యత్వాన్ని తొలగిస్తామని వెల్లడించింది. By Anil Kumar 23 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Karate Kalyani : బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ పేరు బయటికి వచ్చిన విషయం తెలిసిందే కదా.. పోలీసులు కూడా హేమ రేవ్ పార్టీలో ఉందాని స్పష్టం చేసినా కూడా హేమ మాత్రం తనకు రేవ్ పార్టీ కి సంబంధం లేదన్నట్టు చెబుతూ ఇప్పటికే రెండు వీడియోలు సైతం రిలీజ్ చేసింది.ఇక తాజాగా నార్కోటిక్ పోలీసులు హేమ బ్లడ్ సాంపుల్స్ ని కలెక్ట్ చేయగా.. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు గుర్తించారు. దీంతో హేమ బండారం అంతా బయట పడింది. Also Read : రేవ్ పార్టీ కేసు.. మరో ట్విస్ట్ ఇచ్చిన హేమక్క! హేమను 'మా' నుంచి తొలగిస్తాం బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అవ్వడంతో ఇండస్ట్రీలో ఇప్పడు దీని గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇలాంటి తరణంలో కరాటే కళ్యాణి హేమ పై కీలక వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ లో ఇలా డ్రగ్స్ కేసులు నమోదవ్వడం బాధాకరమని చెప్పిన ఆమె, ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన హేమ 'మా అసోసియేషన్' సభ్యత్వాన్ని తొలగిస్తామని పేర్కొంది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్నారని, కేన్స్ 2024 ఫెస్టివల్ లో కన్నప్ప ప్రమోషన్ కోసం వెళ్లారని, మంచు విష్ణు హైదరాబాద్ రాగానే హేమపై చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తామని కరాటే కళ్యాణి చెప్పారు. #actress-hema #manchu-vishnu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి