/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Mudragada-Padmanabham.jpg)
Mudragada Padmanabham: ఏపీలో ఎన్నికల్లో కూటమి క్లిన్ స్వీప్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే తాను పేరు మార్చుకుంటానని కాపు నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. కాగా పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గెలవడంతో చేసిన సవాల్ ప్రకారం తన పేరును మార్చుకుంటున్నట్లు ముద్రగడ చెప్పారు. ముద్రగడ మాట్లాడుతూ.."పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని.. నేను ఓటమి చెందాను. అన్నమాట ప్రకారం నా పేరును ముద్రగడ పద్మనాభరెడ్డి గా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం అంత రెడీ చేసుకున్న." అని అన్నారు.