Kannappa : గ్రాండ్ గా 'కన్నప్ప' టీజర్ లాంచ్.. పోస్టర్ తో అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు!

'కన్నప్ప' టీజర్ ని మే 20 న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తెలుపుతూ.. మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచాన్ని మీకు చూపించేందుకు వేచి ఉండలేకపోతున్నాను. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంఛ్‌ చేస్తు్న్నామని తెలిపాడు.

New Update
Kannappa : గ్రాండ్ గా 'కన్నప్ప' టీజర్ లాంచ్.. పోస్టర్ తో అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు!

Kannappa Teaser Release : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప' షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. రీసెంట్ గానే విదేశాల్లో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇండియన్ టాప్ సెలెబ్రిటీస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందులో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు.

రీసెంట్ గానే ప్రభాస్ కన్నప్ప షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రభాస్ సెట్స్ లో అడుగుపెట్టినట్లు హీరో మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదికూడా ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటోను పంచుకున్నాడు. అయితే ఈ ఫొటోలో ప్రభాస్ ముఖాన్ని చూపించకుండా కేవలం కాళ్ళను మాత్రమే చూపించారు.

ఇందులో ప్రభాస్ శివ భక్తుడైన నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే మంచు విష్ణు 'కన్నప్ప' నుండి మరో అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా టీజర్ లాంచ్ డేట్ ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

టీజర్ లాంచ్ ఎక్కడంటే..

'కన్నప్ప' టీజర్ ని మే 20 న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్నీ మంచు విష్ణు తెలుపుతూ.. మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచాన్ని మీకు చూపించేందుకు వేచి ఉండలేకపోతున్నాను. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నప్ప టీజర్‌ను లాంఛ్‌ చేస్తు్న్నామని తెలిపాడు. టీజర్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో మంచు విష్ణు చేతిలో ఖడ్గం పట్టుకొని ఉన్న లుక్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisment
తాజా కథనాలు