Kannappa : 'కన్నప్ప' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేసిన మంచు విష్ణు!

మంచు విష్ణు తాజాగా కన్నప్ప టీజర్ కి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అందులో టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. " టీజర్‌ను జూన్‌ 14న మీ ముందుకు తీసుకొస్తున్నామని కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉండలేను" అంటూ పేర్కొన్నాడు.

Kannappa : 'కన్నప్ప' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేసిన మంచు విష్ణు!
New Update

Manchu Vishnu Kannappa Teaser Release Date : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి మరో అదిరిపోయేఅప్డేట్ వచ్చింది. భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్స్కేల్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. సౌత్, నార్త్ కి చెందిన టాప్ సెలెబ్రిటీస్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ నెలకొంది. దాన్ని రెట్టింపు చేసేందుకు మంచు విష్ణు నిత్యం ఏదో ఒక అప్డేట్ షేర్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా కన్నప్ప టీజర్ కి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అందులో టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు.

జూన్ 14 న టీజర్...

మంచు విష్ణు తాజాగా తన ట్విట్టర్ లో.." కేన్స్‌లో అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో థ్రిల్‌గా అనిపిస్తోంది. పురాణగాథ ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను జూన్‌ 14న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉండలేను" అని రాసుకొస్తూ ఓ కొత్త పోస్టర్ ని షేర్ చేశాడు.

Also Read : ఆ సాంగ్ లో నటించొద్దని మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు.. అయినా వినలేదు : సమంత

ఈ పోస్టర్ లో హీరో ఓ గుర్రంపై అడవిలో వెళ్తున్నట్టు ఉండటం గమనించవచ్చు. అయితే ఇందులో ముఖం చూపించకుండా కేవలం వెనక భాగం మాత్రమే చూపించి చిన్న సస్పెన్స్ మైంటైన్ చేశారు. దీంతో ఆ గుర్రం పై కూర్చుంది మంచు విష్ణునా? లేక మరో హీరోనా? అనేది నెటిజన్స్ కి అర్థం కావట్లేదు. మొత్తానికి టీజర్ రిలీజ్ డేట్ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ పాల్గొన్నారు. అక్షయ్‌ ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నందీశ్వరుడి పాత్రను ప్రభాస్‌ పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. వీరితో పాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

#kannappa-teaser #manchu-vishnu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe