చిత్రదుర్గ జిల్లాకు చెందిన రేణుకాస్వామి.. ఓ మెడికల్ షాపులో వర్క్ చేస్తుండేవాడు. నెల రోజుల క్రితం రేణుకాస్వామి హత్యకు గురి కాగా.. శనివారం సుమన్నహళ్లి వంతెన దగ్గర అతని డెడ్‌బాడీని గుర్తించారు.ఈ హత్య కేసులో ఈ తెల్లవారుజామున దర్శన్‌ను RRనగర్‌లోని ఆయన నివాసంలో కామాక్షిపాల్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపాడన్న కారణంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని కొంతమంది హత్య చేశారు. ఐతే దర్శన్ సూచనల మేరకు ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఇప్పటివరకూ దర్శన్‌తో పాటు 10 మంది అరెస్టయినట్లు తెలుస్తోంది.
2024 చిత్రదుర్గ జిల్లాకు చెందిన రేణుకాస్వామి.. ఓ మెడికల్ షాపులో వర్క్ చేస్తుండేవాడు. నెల రోజుల క్రితం రేణుకాస్వామి హత్యకు గురి కాగా.. శనివారం సుమన్నహళ్లి వంతెన దగ్గర అతని డెడ్‌బాడీని గుర్తించారు. ఈ హత్య కేసులో దర్శన్ హస్తం ఉందని బెంగళూరు సీపీ దయానంద్ చెప్పారు. రేణుకాస్వామిని బెంగళూరుకు తీసుకువచ్చి.. ఓ షెడ్డులో దర్శన్ సమక్షంలోనే ఆయన బౌన్సర్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో రేణుకాస్వామి అక్కడికక్కడే మరణించారు. తర్వాత దర్శన్ సూచనలతో డెడ్‌బాడీని నలుగురు నిందితులు ఓ కల్వర్టులో పడేశారు. దర్శన్ సూచనల మేరకే హత్య చేసినట్లు పట్టుబడినవారిలో నలుగురు నిందితులు అంగీకరించినట్లు సమాచారం.