Pavitra- Darshan: కన్నడ స్టార్ నటుడు దర్శన్, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడ కలిసి చేసిన రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దర్శన్‌ను ఆయన భార్యకు వదిలి తనతో రావాలంటూ పవిత్రకు రేణుకస్వామి అసభ్యకర సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. కావాలంటే నీ రేటు ఎంత చెప్పు.. నిన్ను నేను పోషిస్తా అంటూ పవిత్రను రేణుకస్వామి వేధించినట్లు దర్యాప్తులో తేలింది.
మర్మాంగం వీడియోలు పంపిస్తూ టార్చర్..
అయితే నిరంతంర తనకు శృంగార ఫొటోలు, తన మర్మాంగం వీడియోలు పంపిస్తూ టార్చర్ చేస్తున్న రేణుకస్వామికి ఎలాగైన బుద్ధిచెప్పాలని ప్లాన్ చేసింది పవిత్ర. ఇందుకోసం తన స్నేహితుడు పవన్ సాయం తీసుకుంది. పవన్ ఫోన్ నుంచి రేణుకస్వామికి ఫోన్ చేసిన పవిత్ర ఇదే తన మరో నెంబర్ అని, ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని చెబుతూ ఆధారాలు చేజిక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసి కేవలం వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత నిజమైన ఫొటోలు పంపిస్తేనే కలుస్తానంటూ డిమాండ్ చేయడంతో గుడ్డిగా నమ్మిన రేణుకాస్వామి తన వివరాలన్నీ పవిత్రకు పంపించాడు. ఇలా మూడు నెలలపాటు మెసేజ్ ల రూపంలో రేణుకస్వామి యవ్వారమంతా ఫ్రూప్స్ తో పాటు దర్శన్ కు చూపించింది పవిత్ర.
బలవంతంగా ఎత్తుకొచ్చి..
ఈ క్రమంలోనే రేణుకస్వామిని కలిసేందుకు అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర సహకారం తీసుకున్నాడు దర్శన్. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మరికొన్ని రోజులు ఆగి జూన్ 8న దర్శన్ మాట్లాడేందుకు రమ్మంటున్నారని చెప్పి రాఘవేంద్ర మనుషులు రేణుస్వామిని బలవంతంగా ఎత్తుకొచ్చారు. రేణుకతో మాట్లాడుతుండగానే విచక్షణ కోల్పోయిన దర్శన్.. తన మనుషులతో దాడి చేయించాడు. దీంతో రేణుక అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడే కన్నుమూశాడు. అనంతరం మృతదేహాన్ని పట్టణగెరె నుంచి కామాక్షిపాళ్య ఠాణా దగ్గరలో పడేశారు. ఈ దారుణం జరుగుతున్నప్పుడు పవిత్రగౌడ, పవన్, ఇతర నిందితులంతా అక్కడే ఉన్నట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రేణుకస్వామిని దర్శన్ చంపలేదని అభిమానులు వాదిస్తున్నారు. దర్శన్ అలాంటి వాడు కాదని, అనవసరంగా ఈ కేసులో ఇరికించారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇక భార్య 8 నెలల గర్భంతో ఉండగా అసభ్య ప్రవర్తనతో ప్రాణాలు కోల్పోయిన రేణుకస్వామిపై కొంతమంది జాలీ చూపుతున్నారు.