/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-15.jpg)
Kanguva Vs Vettaiyan : తమిళ సినిమా ఇండస్ట్రీలో బడా ప్రొజెక్ట్స్ గా తెరకెక్కుతున్న కంగువా, వేట్టయాన్ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద భీకర పోటీని ఎదుర్కోనున్నాయి. సూర్య నటించిన కంగువా మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక తాజాగా రజినీకాంత్ నటించిన వేట్టయాన్ మూవీ విడుదల తేదీని నిర్మాణసంస్థ వెల్లడించింది.
‘వేట్టయాన్’ అక్టోబర్ 10న మీ ముందుకురానుంది అని లైకా ప్రొడక్షన్స్ పోస్ట్ పెట్టింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఇది విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించడంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఇక ఈ అప్‌డేట్ ఇచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో బాక్సాఫీస్ దగ్గర ‘కంగువా’ వర్సెస్ ‘వేట్టయాన్’ అనే రచ్చ మొదలైంది.
Target locked 🎯 VETTAIYAN 🕶️ is set to hunt in cinemas worldwide from OCTOBER 10th, 2024! 🗓️ Superstar 🌟 as Supercop! 🦅
Releasing in Tamil, Telugu, Hindi & Kannada!#Vettaiyan 🕶️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran… pic.twitter.com/WJi2ZvpX8Z
— Lyca Productions (@LycaProductions) August 19, 2024
Also Read : ఆ డైరెక్టర్స్ ను వదిలేసి నన్ను మాత్రమే ఎటాక్ చేస్తున్నారు : హరీష్ శంకర్
సూర్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు అంచెలంచెలుగా పెరుగుతున్నాయి. అటు రజినీకాంత్ వెట్టయాన్ పై కూడా అంతే హైప్ ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుందో తెలియాలంటే అక్టోబర్ 10 వరకు వేచి చూడాల్సిందే.