/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-06T174341.249.jpg)
హిమాచల్‌ప్రదేశ్‌లో మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కంగనా ఢిల్లీకి వెళ్తుండగా.. చండీఘర్ విమానశ్రయంలో ఆమెకు, కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్‌ఎఫ్ మహిళా జవాన్‌కు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ మహిళా జవాన్.. కంగానా చెంపపై కొట్టారు. గతంలో కంగానా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: RTV చేతిలో లోకేష్ రెడ్ బుక్ .. సిరీస్-1లో ఐదుగురి పేర్లు.. ఎవరెవరున్నారంటే?
ఢిల్లీకి చేరుకున్న అనంతరం కంగనా రనౌత్.. సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నినా సింగ్, సీనియర్ అధికారులను కలిసి తనకు జరిగిన చేదు అనుభవంపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మహిళా జవాన్ కుల్విందర్ కౌర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
#KanganaRanaut slapped by a CISF constable, Kulwinder Kaur. She was upset with Kangana's comments on farmers. pic.twitter.com/kK9Tnfxt8m
— Lakshminarayana Varanasi (@lnvaranasi) June 6, 2024