Kamareddy: సిర్పూర్‌లో వ్యక్తి దారుణ హత్య..కారణం వివాహేత సంబంధం

కొంతమంది వక్రబుద్ధితో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వారి సుఖం కోసం పిల్లలను, జీవితాన్ని కష్టాలలోకి నెట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. భవిష్యత్‌ను అంధకారంగా మార్చుతున్నా.. కటకటాల్లోకి వెళ్తున్నా.. పిల్లలు గోడువెళ్లబోస్తున్నా.. వారు మాత్రం మారటం లేదు. ఇలాంటి గదే మరొకటి.

New Update
AP: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..!

ఆలస్యంగా వెలుగులోకి..

కామారెడ్డి జిల్లా సిర్పూర్‌లో దారుణ హత్య కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి.. తాజాగా హాట్‌ టాపిక్‌ అయింది. కొడుకు శివ కుమార్ కనబడడం లేదంటూ ఫిర్యాదు చేసిన తండ్రికి నిరాశ మిలిగింది. ఓ రాక్షశుడి చేసితిలో బలైయ్యాడు. దీనికి కారణం అక్రమ సంబంధమే. వివాహేతర సంబంధాలు ఈ మధ్య కొన్ని జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన నామేవార్ శివకుమార్ రెండు నెలల క్రితం (జూలై 25వ) తేదీ నుంచి కనపడడం లేదు. గత నెల (ఆగస్ట్ 20న) మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో అతని తండ్రి గంగారం ఫిర్యాదు చేసినాడు. ఈ ఫిర్యాదుపైన దర్యాప్తు చేసిన సిర్పూర్ గ్రామానికి చెందిన మసూద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా అనిపించడంతో మద్నూర్ పోలీసులు పీఎస్‌కు తీసుకువచ్చి అతన్ని విచారించారు. ఈ విచారణంలో శివకుమార్ భార్యతో గల అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని శివకుమార్‌ను మందుతాగుదాం అని పిలిచానని పోలీసులకు చెప్పాడు.

మందుతాగించి హత్య చేశాడు

ఈ క్రమంలోనే బైక్ పైన ఎక్కించుకొని బిలోలి మండలం నాగిని శివారులో గల మంజీరా నదిలో మందుతాగించి అతని తలపై పలుమార్లు కొట్టి చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత పారుతున్న మంజీరా నది ప్రవాహంలో పడవేసినాడు. హంతకుడు మసూద్‌పై ఎస్సీ కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాన్సువాడ డీఎస్‌పీ జగన్నాథరెడ్డి. నిందితుడిని బాన్సువాడ కోర్టులో హాజరు పరచగా నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఈ సంబంధాలతో ప్రాణాలు పోతున్నాయి

వివాహేతర సంబంధాల కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోతుందన్నది. ఇలాంటివి తెలిసి తప్పుచేస్తే పిల్లలు, వృద్ధులు అనాథలైపోతారన్నారు. అంతేకాకుండా కనీవినీ ఎరుగని రీతిలో హత్యలకు జరుగుతున్నాయి. అడ్డుతొలగించుకుంటే అంతా మనమేనన్న భ్రమతో.. చివరకు కుటుంబంలో ఒకరిని పొట్టనపెట్టుకుంటున్నాయి. పోలీసుల విచారణలో దొరికి, చివరకు జైలు గోడల మధ్యన నలిగిపోయేలా చేస్తున్న విషయం వాస్తవం.వివాహేతర సంబంధాలు కుటుంబ బాంధవ్యాలను నాశనం చేస్తున్నాయి. ఏం చేయాలో తెలియని స్ధితిలో నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు జిల్లాలలో వరసగా చోటుచేసుకుంటున్నాయి. అందరిని ఉలిక్కిపడుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు