K.Venkataramana Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్ టైమ్ పోటీలో దిగి.. ఒక ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిని ఓడించి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు కే. వెంకటరమణ రెడ్డి. అయితే ఎమ్మెల్యేగా గెలవకముందు నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉంటూ సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సొంత డబ్బులు కాదు కదా.. పార్టీ ఫండ్స్ కూడా తీసుకురాలేకపోతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే కేంద్ర బడ్జెట్‌లో మోదీ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేసినట్లు రాష్ట్ర బీజేపీ నాయకులు ఒప్పుకుంటున్నారా? సొంత డబ్బులు పెట్టలేక, నిధులు తెప్పించలేక కామారెడ్డి అభివృద్ధిని సొంత ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్న ఆరోపణలు నిజమేనా? వంటి ఆసక్తికరమైన విషయాలను RTVతో పంచుకున్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి.
అంతేకాదు కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలోకి రాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన సంచలన విషయాలు బయటపెట్టారు. పూర్తి సమాచారం కోసం కింది వీడియో చూడండి.