Producer Ashwini Dutt : చంద్రబాబు ప్రభుత్వంలో 'ప్రభాస్' నిర్మాతకు కీలక పదవి!

సీనియర్ నిర్మాత అశ్వనీదత్ కి కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బాధ్యతలను అప్పగించబోతున్నారట. అశ్వినీదత్ కు ఎన్టీఆర్ కుటుంబంతో, చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
Producer Ashwini Dutt : చంద్రబాబు ప్రభుత్వంలో 'ప్రభాస్' నిర్మాతకు కీలక పదవి!

Kalki Movie Producer Ashwini Dut : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఊహించని విధంగా అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో దాదాపు 135 సీట్లను గెలుచుకున్న కూటమి త్వరలోనే ప్రభుత్వం చేయబోతుంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పలు పదవుల్లో ఉన్న వాళ్ళు రాజీనామా చేస్తుండగా.. త్వరలోనే కూటమి ప్రభుత్వం తరపున కొత్త వాళ్ళని నియమించనున్నారు.

ఇప్పటికే టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసాడు. దీంతో ఈ పదవి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఆ అగ్ర నిర్మాతకు రాబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది కాస్త రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Also Read : ఎట్టకేలకు సెట్స్ పైకి ‘కాంచన 4’.. సెప్టెంబర్ లో షూటింగ్, రిలీజ్ ఎప్పుడంటే?

'కల్కి' నిర్మాతకు టీటీడీ చైర్మన్ పదవి...

టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్వనీదత్ కి కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బాధ్యతలను అప్పగించబోతున్నారట. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో కల్కి సినిమాను నిర్మిస్తున్నారు. కాగా అశ్వనీదత్ ముందు నుంచి కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పట్నుంచి ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు.

ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి, కూటమి భారీగా గెలుస్తుందని చెప్పాడు. అశ్వినీదత్ టీడీపీ సపోర్ట్ అని పరిశ్రమలో కూడా అందరికి తెలిసిందే. అలాగే అశ్వినీదత్ కు ఎన్టీఆర్ కుటుంబంతో, చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది.

ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అశ్వనీదత్ కి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో చంద్రబాబు హయాంలో ఇదే టీటీడీ చైర్మన్ పదవిని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావుకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ పదవికి అశ్వనీదత్ కి ఇచ్చే అవకాశం ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు