Kalki Director Nag Ashwin : బాలీవుడ్ (Bollywood) నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi) ఇటీవల ప్రభాస్ (Prabhas) పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై టాలీవుడ్ (Tollywood) నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రీసెంట్ గా అర్షద్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా తనకు నచ్చలేదని, సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లాగా కనిపించాడని కామెంట్స్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలొచ్చాయి.
ఇప్పటికే పలువురు స్టార్స్ దీన్ని తప్పు పట్టగా.. తాజాగా 'కల్కి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఈ వివాదంపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో.." నార్త్-సౌత్, టాలీవుడ్ వెర్సస్ బాలీవుడ్.. ఇలా పోలుస్తూ వెనక్కి వెళ్లొద్దు. మనమందరం ఒక ఇండస్ట్రీకి చెందినవాళ్లమే. అర్షద్ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది. అయినా ఫర్వాలేదు.
మేము అతడి పిల్లల కోసం ‘కల్కి’ బుజ్జి బొమ్మలు పంపిస్తాం.
Also Read : బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు ఊహించని గెస్ట్.. ఎవరంటే?
కల్కి రెండోభాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తాను. అందులో ప్రభాస్‌ను బెస్ట్‌గా చూపిస్తాను. ప్రపంచంలో చాలామంది మనల్ని ద్వేషిస్తారు. కానీ, మనం వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లాలి. ప్రభాస్ కూడా ఇదే మాట అంటుంటాడు" అని రాసుకొచ్చాడు. దీంతో నాగ్ అశ్విన్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.