Kalki 2898AD : 'కల్కి' దెబ్బకు 'సలార్' రికార్డ్స్ బ్రేక్..!

ఓవర్సీస్ లో 'కల్కి' క్రేజ్ పీక్స్ లో ఉంది. అక్కడ ఈ సినిమా జూన్ 26 న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రీ సేల్స్ ప్రీ సేల్స్‌ ఓపెన్‌ చేయగా అవి 'సలార్' రికార్డును బ్రేక్ చేశాయి. ‘సలార్‌’ ప్రీ సేల్‌ బుకింగ్స్‌ను ‘కల్కి’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందుగానే క్రాస్‌ చేయడం విశేషం.

Kalki 2898AD : 'కల్కి' దెబ్బకు 'సలార్' రికార్డ్స్ బ్రేక్..!
New Update

Kalki Breaks Salaar Movie Record : టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో కల్కి క్రేజ్ పీక్స్ లో ఉంది. అక్కడ ఈ సినిమా జూన్ 26 న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రీ సేల్స్ ప్రీ సేల్స్‌ ఓపెన్‌ చేయగా అవి ప్రభాస్‌ గత సినిమా 'సలార్' రికార్డును బ్రేక్ చేశాయి. ‘సలార్‌’ ప్రీ సేల్‌ బుకింగ్స్‌ను ‘కల్కి’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందుగానే క్రాస్‌ చేయడం విశేషం. ఈ చిత్రం ప్రీ సేల్స్‌ స్టార్ట్ చేసిన గంటల్లోనే ‘RRR’ రికార్డులను బ్రేక్‌ చేసింది.

Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏపీ సర్కార్ మరో శుభవార్త.. ‘కల్కి’ కోసం స్పెషల్ పర్మిషన్!

ఇప్పటి వరకు కేవలం నార్త్‌ అమెరికాలోనే 1,25,000 టికెట్స్‌ అమ్ముడైనట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. మరోవైపు కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ‘బాహుబలి 2’, ‘RRR’ సినిమాలు మాత్రమే ఈ ఫిగర్ ను క్రాస్ చేసాయి. ఇప్పుడు కల్కి వాటిని కచ్చితంగా బ్రేక్ చేస్తుందని అంటున్నారు. అదే నిజమైతే ప్రభాస్ కెరీర్ లో 'కల్కి' ఓ మైల్ స్టోన్ మూవీగా మిగిలిపోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

#prabhas #kalki-2898ad #salaar-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి