Kalki 2898 AD:  బుజ్జిని తీసుకొచ్చిన భైరవ.. ప్రభాస్ కల్కి రచ్చ స్టార్ట్ అయిపోయింది.. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘కల్కి 2898 AD’ మూవీలో ముఖ్యమైన బుజ్జిని గ్రాండ్ గా పరిచయం చేశారు. రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫాన్స్ కి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. బుజ్జి టీజర్ పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. 

Kalki 2898 AD:  బుజ్జిని తీసుకొచ్చిన భైరవ.. ప్రభాస్ కల్కి రచ్చ స్టార్ట్ అయిపోయింది.. 
New Update

Kalki 2898 AD: త్వరలో మనలోకి ఒకరు వచ్చి చేరబోతున్నారు.. అంటూ యంగ్ రెబల్ స్టార్ కొట్టిన ఒక ట్వీట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి కబురు చెప్పాడంటూ కథనాలు.. మీమ్స్ తెగ హడావుడి చేసేశాయి. ఆ కథనాలు.. ఫ్యాన్స్ లెక్కలు తప్పు అని చెబుతూ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కల్కి 2898 AD’ సినిమాకి సంబంధించిన బుజ్జి అనే పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. చాలా ఆసక్తికరంగా.. హాలీవుడ్ రేంజ్ లో వచ్చిన ఆ టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ మెస్మరైజ్ అయిపోయారు. బుజ్జీ.. నీకు టైమ్ వచ్చేసింది అంటూ ప్రభాస్ చెప్పడం.. ఒక కారు పై ఉన్న కవర్ తీయడంతో ఆ టీజర్ ముగించారు.. అందులోనే మే 22న బుజ్జిని పరిచయం చేస్తాం అంటూ డేట్ ఫిక్స్ చేశారు.. ఆ డేట్  రానే వచ్చింది.. 

Kalki 2898 AD: రామోజీ ఫిలిం సిటీలో పెద్ద మైదానం.. దానికి ఒక పక్కగా పెద్ద స్టేజ్.. గ్రౌండ్ చుట్టూ వేలాదిగా జనం.. ఆటలు.. పాటలు.. సినిమా విశేషాల టీజర్లు.. అన్నీ ఒకదాని తరువాత ఒకటి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ వచ్చాయి.. ఇక ప్రభాస్ కోసం ఫాన్స్.. భైరవ.. భైరవ.. అంటూ నినాదాలు ఇస్తుండగా.. బుజ్జితో ప్రభాస్ గ్రౌండ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. స్వయంగా బుజ్జిని నడుపుతూ గ్రౌండ్ లో రౌండ్స్ కొడుతున్న ప్రభాస్ ను చూసి ప్రేక్షకులు పిచ్చెత్తిపోయారు. ప్రభాస్ చిన్నమ్మ శ్యామలాదేవి ప్రభాస్ ని బుజ్జితో కలిసి చూసి తన సంతోషాన్ని దాచుకోలేకపోయారు. చిన్న పిల్లలా ఆమె కేరింతలు కొట్టిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటె.. బుజ్జి స్పెషాలిటీస్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నాగ్ అశ్విన్ బుజ్జి మేకింగ్ గురించి చెప్పారు. దానివెనుక ఉన్న నిపుణులు.. వారి కష్టం అన్నిటినీ వివరించారు. అప్పటికే స్క్రీన్ అయినా టీజర్ చూస్తేనే నాగి బృందం పడిన తపన కనిపించింది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపించింది. బుజ్జి కథేమిటో చూద్దాం.. 

బుజ్జి మెదడుకు.. భైరవ ఇచ్చిన బాడీ..

Kalki 2898 AD: బుజ్జి అంటే ఒక మెదడుగా పరిచయం చేశారు. శరీరం లేకుండా మెదడు ఏమీ చేయలేదు కదా. అందుకే.. రీజన్ రివీల్ కాలేదు కానీ, భైరవ ఆ బుజ్జి మెదడుకు ఒక పెద్ద కారు సిద్ధం చేశాడు. బుజ్జి మెదడుతో నడిచే ఆ కారుతో భైరవ చేసిన ఎడ్వాంచర్స్ టీజర్ లో అదిరిపోయాయి. 50 సెకన్ల టీజర్ లో విజువల్స్.. బీజీఎం మామూలుగా లేవు. ఇక బుజ్జి బాడీ అంటే స్టమ్-మేడ్ కారు మేకింగ్ లో ఆనంద్ మహీంద్రా సహాయం చేశారు. దర్శకుడు నాగి.. X (గతంలో ట్విట్టర్)లో ఆయనకు ఒక పోస్ట్ చేశారు. “డియర్ @anandmahindra సార్...మేము Mr. బచన్, ప్రభాస్, డీపీల తో కలిసి ప్రాజెక్ట్ కె అనే సినిమా తీస్తున్నాం. భారతీయ సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. ఇప్పటి టెక్నాలజీని మించిన టెక్నాలజీతో కొన్ని వాహనాలు ఈ సినిమా కోసం అవసరం. అనుకున్న విధంగా ఈ వాహనాలను సినిమాలో ఉపయోగిస్తే.. అది ప్రజలకు రీచ్ అయితే అది జాతికే గర్వకారణం అవుతుంది.” ఇలా చెబుతూనే ఆనంద్ మహీంద్రాను బుజ్జి మేకింగ్ లో టెక్నాలజీ సహకారం అందించాలని కోరారు. ఆనంద్ మహీంద్రా  దానికి ఒప్పుకుని బుజ్జి మేకింగ్ లో సహాయం అందిస్తామని చెప్పారు. 

ఇది కూడా చదవండి: రేవ్ పార్టీ కేసు.. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు!

Kalki 2898 AD: అనుకున్నట్టుగానే ఆయన సహాయం చేయడంతో అంతకు రెండేళ్ల ముందు నుంచి కారు రెడీ చేయడానికి కష్టపడుతున్న నాగీ టీమ్ కి సపోర్ట్ దొరికింది. దీంతో నాలుగేళ్ల శ్రమతో దానిని సిద్ధం చేసి ఇదిగో ఇప్పుడు అందరికీ చూపించారు. బుజ్జి సినిమాలో ప్రభాస్ తో సమానంగా కనిపిస్తుంది. ఈ బుజ్జికి మాటలు కీర్తి సురేష్ ఇచ్చింది. టీజర్ లో బుజ్జి డైలాగ్స్.. వాయిస్ అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. 

Kalki 2898 AD: మొత్తంగా చూసుకుంటే.. టాలీవుడ్ చరిత్రలోనే ఒక పాత్రని పరిచయం చేయడానికి ఇంత పెద్దఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ప్రభాస్ లుక్.. కారు డిజైన్.. కారుని చూసిన అభిమానులే కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఈ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. 

కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ పాన్ వరల్డ్ సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ అశ్వత్థామగా నటిస్తుండగా.. ఒక కీ రోల్ లో కమల్ హాసన్ కూడా కనిపించనున్నారు. ఇక దీపికా పాడుకొనే, దిశా పటానీ హీరోయిన్లు. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలోకి రానుంది. 

#prabhas #kalki-2898-ad-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe