Kaleshwaram: కాళేశ్వరం అవినీతి.. కేఏపాల్ పిటిషన్ విచారణ వాయిదా!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ మరో వారానికి వాయిదా వేసింది.

Kaleshwaram: కాళేశ్వరం అవినీతి.. కేఏపాల్ పిటిషన్ విచారణ వాయిదా!
New Update

Kaleshwaram: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై విచీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ మౌసమీ భట్టాచార్యతో కూడిన బెంచ్​ విచారించగా... అవినీతి జరిగిందని లోక్ సభ ఎన్నికల ప్రచారం తరహాలో వాదనలు వినిపించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.

ఇది కూడా చదవండి: Rajasthan: ఎయిర్ స్ట్రిప్‌పైకి దూసుకొచ్చిన ఎద్దు.. వీడియో వైరల్!

ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జె.అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్ తో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌  స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బి.రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కోదండరాం రెడ్డి, ముదుగంటి విశ్వనాథ రెడ్డి, బక్క జడ్సన్‌‌‌‌‌‌‌‌ వేసిన పిల్స్‌‌‌‌‌‌‌‌పై తదుపరి విచారణను మరో వారం వాయిదా వేసింది.

#kaleswaram-corruption #k-a-paul #petition-hearing-postponed
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe