Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణ మరోసారి పొడిగింపు! కాళేశ్వరం కమిషన్ విచారణను తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా జీవో జారీ చేశారు. By srinivas 31 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Kaleswaram: కాళేశ్వరం కమిషన్ విచారణను తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్‌బొజ్జా జీవో జారీ చేశారు. ఈ బ్యారేజ్ లీకేజీలపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. కాగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలపై 100 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి జూన్ వరకు నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరింది. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 31 వరకు గడువు పొడిగించగా ఆ గడువు ముగిసింది. అయితే దీనిపై అక్టోబర్ 31 వరకు నివేదిక ఇవ్వాలని గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. #rahul-bojja #kaleswaram-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి