Kaleshwaram Project CAG Report in Telangana Assembly
-
Feb 15, 2024 12:34 ISTప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారు.
కాళేశ్వరం కోసం బారీగా రునాలు తీసుకున్నారు. 15 బ్యాంకులతో 87వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. బడ్జెటేతర రుణాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ ఆధారపడింది. రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసింది.
-
Feb 15, 2024 12:21 ISTవ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయి
కాళేశ్వరం డీపీఆర్ తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయి. అయినా రీఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారు.
-
Feb 15, 2024 12:16 ISTరుణాలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి.
కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036లో పూర్తవుతుంది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగింది . దాని వలన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు వడ్డితో సహా 1,47,427 కోట్లకు పెరిగింది.
-
Feb 15, 2024 11:53 ISTప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్ లేదు
ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరార్థకం అయ్యాయి.. ఫలితంగా 767 కోట్లు నష్టం వాటిల్లింది.
-
Feb 15, 2024 11:44 ISTభారీ వడ్డీల భారం..
కేఐసీసీఎల్ రుణాలపై ఏటా 7.8 శాతం నుండి 10.9 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్న కాగ్
-
Feb 15, 2024 11:43 ISTకేఐసీసీఎల్ ద్వారా భారీగా రుణాలు
ప్రాజెక్టు నిధులు సమకూర్చుకోవడం కోసం కేఐసీసీఎల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో కేఐసీసీఎల్ ద్వారా రూ.87,449 కోట్ల రుణాలు సమీకరించినట్టు వెల్లడించిన కాగ్
-
Feb 15, 2024 11:42 ISTప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే ప్రాజెక్టుకు నిధులు?
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చుకున్నారో.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవు అని తేల్చిన కాగ్
-
Feb 15, 2024 11:41 IST2022 మర్చి నాటికి అనుమతులు
కాగ్ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి మొత్తం రూ.లక్షా 10వేల 248 కోట్లు అనుమతులు ఇచ్చారు
-
Feb 15, 2024 11:39 ISTఅనుమతులన్నీ ఒకేసారి ఇవ్వలేదు
కాళేశ్వరం ప్రాజెక్టు అంచానాల అన్నిటికీ కలిపి ప్రభుత్వం ఓకేసారి అనుమతి ఇవ్వలేదు. విడతల వారీగా ఒక్కో పనికీ విడివిడిగా అనుమతులు జారీ చేశారని తేల్చిన కాగ్ నివేదిక
-
Feb 15, 2024 11:37 ISTకాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,911 కోట్లుగా పేర్కొన్న కాగ్
-
Feb 15, 2024 11:36 ISTఆరువేల కోట్లకు పైగా ఖర్చు
50టీఎంసీల సామర్ధ్యం.. రూ.6వేల 126 కోట్లతో మల్లన్న సాగర్ నిర్మించారని చెప్పిన కాగ్
-
Feb 15, 2024 11:35 ISTమల్లన్న సాగర్ కు భూకంపాల బెడద
మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో భూకంపాలపై లోతైన అధ్యయానాలేవి నిర్వహించకుండానే ప్రాజెక్ట్ నిర్మించారని చెప్పిన కాగ్ రిపోర్ట్
-
Feb 15, 2024 11:33 ISTమల్లన్నసాగర్ ప్రాంతంలో ఫాల్ట్
ఎన్జీఆర్ఐ ఆధ్యయనంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించే ప్రదేశంలో డీప్ సీటెడ్ వెర్డికల్ ఫాల్ట్ ఉందని పేర్కొన్నట్లు కాగ్ వెల్లడి
-
Feb 15, 2024 11:32 ISTకొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు సరికాదు
కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదించిన ప్రదేశం అనుకూలంగా లేదన్న కాగ్..
-
Feb 15, 2024 11:27 ISTఅదనంగా నిర్వహణ ఖర్చులు కూడా..
విద్యుత్ ఖర్చులతో పాటు అదనంగా నిర్వాహణ ఖర్చు రూ.272 కోట్లు అవుతున్నట్లు కాగ్ వెల్లడి. మొత్తం ప్రాజెక్ట్ నిర్వాహణ ఖర్చు ఏడాదికి రూ.10వేల 647 కోట్లుగా చెప్పిన కాగ్
-
Feb 15, 2024 11:26 ISTభారీగా విద్యుత్ ఖర్చు
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటా విద్యుత్ చార్జీల కోసం రూ.10వేల 374 కోట్లు ఖర్చు అవుతున్నట్లు కాగ్ నివేదికలో వెల్లడి
-
Feb 15, 2024 11:24 ISTప్రాజెక్ట్ ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారని చెప్పిన కాగ్
-
Feb 15, 2024 11:23 ISTవేల కోట్ల నుంచి లక్ష కోట్లకు భారీగా పెరిగిన వ్యయం..
రూ.63వేల352 కోట్ల నుంచి రూ. లక్షా 2వేల 267 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్న కాగ్
-
Feb 15, 2024 11:22 ISTప్రతిపాదనల కంటే ఎక్కువ ఖర్చు
ప్రాజెక్టు డీపీఆర్‌కు ముందు రూ.25వేల కోట్లతో ప్రతిపాదనలు
-
Feb 15, 2024 11:20 ISTఅందువల్లే కోట్లాది రూపాయల నష్టం
కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ ఇంజినీరింగ్ మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్న కాగ్ రిపోర్ట్
-
Feb 15, 2024 11:18 ISTరీఇంజనీరింగ్ వల్ల సమస్యలు
అప్పటికే పూర్తి చేసిన పనులలో మార్పులు.. రీ ఇంజనీరింగ్ వాల్ల కొన్ని పనులు పనికిరానివిగా మారాయి
-
Feb 15, 2024 11:17 ISTవిద్యుత్ వినియోగానికి అదనపు వ్యయం
కాళేశ్వరం ప్రాజెక్ట్ విద్యుత్ వినియోగానికి అదనపు వ్యయం భారీగా పెరిగింది.
-
Feb 15, 2024 11:15 ISTభారీగా పెరిగిన వ్యయం.. ప్రయోజనం శూన్యం
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగింది. కానీ, అదనంగా ఏమీ ప్రయోజనం లేదన్న కాగ్ నివేదిక
-
Feb 15, 2024 11:13 ISTకాగ్ నివేదికలో సంచలన విషయాలు
కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ఉన్నాయి
-
Feb 15, 2024 11:12 ISTఅసెంబ్లీలో కాగ్ నివేదిక
కాగ్ నివేదికను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.