Ambedkar Konaseema: ఆ ఊరి గడపగడపలో గణనాథులు పుట్టుక

ఆ ఊరిలో ఇంటింటికీ గణనాధులు తయారు చేసే హస్త కళాకారులు ఉన్నారు. మూడు తరాల నుంచి విగ్రహాలు తయారీలో ప్రసిద్ధిగాంచింది ఆ గ్రామం. వినాయక చవితికి దూర ప్రాంతాలకు ఇక్కడ నుండే వినాయక మట్టి విగ్రహాలు తరలింపు అవుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం.

New Update
Ambedkar Konaseema: ఆ ఊరి గడపగడపలో గణనాథులు పుట్టుక

మూడు తరాల నుంచి విగ్రహాలు తయారీ

ఆ ఊరిలో ఇంటింటికీ గణనాధులు తయారు చేసే హస్త కళాకారులు ఉన్నారు. మూడు తరాల నుంచి విగ్రహాలు తయారీలో ప్రసిద్ధిగాంచింది ఆ గ్రామం. వినాయక చవితికి దూర ప్రాంతాలకు ఇక్కడ నుండే వినాయక మట్టి విగ్రహాలు తరలింపు అవుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం మట్టి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం. గ్రామంలో సుమారు 100 కుటుంబాలు మట్టి విగ్రహాల తయారీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. ఇక్కడ తయరుచేసే విగ్రహాలకు కేవలం మట్టి, కొబ్బరిపీచు, సహజసిద్దమైన రంగలతో మాత్రమే విగ్రహాలు ఉంటాయి. పర్యావరణానికి హాని ఉండదని నీటిలో సులభంగా కలుగుతాయని తయారీదారులు తెలుపుతున్నారు. ఈ గ్రామంలో మూడు తరాల క్రితం ఒక్క కుటుంబంతో ప్రారంభమైన.. ఈరోజు 100 కుటుంబాలకు జీవనాధారం విగ్రహాల తయారీ కేంద్రం ఉంది. వినాయక చవితి, దశరా సమయాలలో వినాయకుడు, దుర్గామాత విగ్రహాలు ఎక్కువగా తయారు చేస్తారు.

ప్రభుత్వం రుణాలు కల్పించాలి

అయితే వీటిని స్దానిక వ్యాపారులే కాకుండా వివిధ రాష్టాలకు చెందిన వ్యాపారులు వచ్చి కొనుగోలు చేసి అమ్మకాలకు తరలిస్తారు. ఈ మద్య కాలంలో ఇతరులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తయారు చేయడంవల్ల తమ‌ మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గిందని తయారీ దారులు వాపోతున్నారు. రాబోవు కాలంలో మట్టి విగ్రహాల తయారుచేసే వారు తమ ఉపాధిని కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హస్త కళాకారులు.ప్రభుత్వం మట్టి విగ్రహాల తయారీని కుటీర పరిశ్రమలా గుర్తించి రాయితీపై బ్యాంకుల ద్వారా రుణాలు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

కనుమరుగయ్యే ప్రమాదం ఉంది

కళాకారులకు నలభై అయిదు సంవత్సరాలకు ప్రభుత్వం పెన్షన్‌ మంజారు చేసి తమను ఆదుకోవాలని మట్టి విగ్రహాల తయారీదారుల డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు వస్తే తయారు చేసిన మట్టి బొమ్మలకు భద్రపరిచేందుకు షెడ్లు లేకపోవడంతో తడిసిపోతున్నాయని ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే షెడ్లు లేక తార్బన్ సౌకర్యాలు అవసరం ఉందటున్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి బొమ్మల తయారిచేసే మాకు ప్రభుత్వాలు, నాయకులు గుర్తించి ఆదుకుంటే రాబోయే తరాలకు ఈ హస్తకళ బతికి ఉంటుందన్నారు. లేకపోతే నేటితరం యువత ఇటువైపుకు వచ్చే అవకాశాలు తగ్గి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని విగ్రహ తయారీదారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు