KU Distance Education 2024: వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీ డిస్టెన్స్ ఎడ్యూకేషన్ కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల వారు ఆన్ లైన్ వేదికగా ఆగస్టు 31వ వరకూ అప్లై చేసుకోవాలని సూచించింది.
మూడేళ్ల యూజీ కోర్సులు:
మూడేళ్ల వ్యవధితో కూడిన కోర్సులు.. బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ (మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్/ కంప్యూటర్ సైన్స్) బిఎల్ ఐసీ.
రెండేళ్ల పీజీ కోర్సులు:
ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్).
ఒక ఏడాది కోర్సులు:
బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్ సి స్కిల్స్
దరఖాస్తు:
2024 ఆగస్టు 31 చివరి తేది.
మరిన్ని వివరాలకోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. http://sdlceku.co.in/index.php మెయిల్ - info@sdlceku.co.in