ఇండస్ట్రీని కలవరపెడుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో

మరో డీప్ ఫేక్ వీడియో సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. బాలీవుడ్ నటి కాజోల్ బట్టలు మార్చుకుంటున్నట్లు చూపించే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది జూన్‌ లో టిక్‌టాక్‌ వేదికగా ఓ సోషల్‌మీడియా స్టార్‌ పోస్ట్ చేసిన వీడియోకు కరీన ఫేస్ పెట్టి నెట్టింట పోస్ట్ చేశారు.

New Update
ఇండస్ట్రీని కలవరపెడుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మరో డీప్ ఫేక్ వీడియో కలవరపెట్టింది. ఇటీవలే నటి రష్మికకు జరిగిన దారుణం నుంచి బయటపడకముందే మరో హీరోయిన్‌ను ఆకతాయిలు టార్గెట్‌ చేశారు. ఈ మేరకు బాలీవుడ్‌ నటి కాజోల్‌పై 'గెట్‌ రెడీ విత్‌ మీ' అనే పేరుతో డీప్‌ ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు. ఓ మహిళా బట్టలు మార్చుకుంటుండగా దానికి కాజోల్‌ ముఖాన్ని జతచేసి కాజోల్ డ్రెస్‌ ఛేంజింగ్‌ వీడియో అంటూ నటిపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.

Also read :అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన శ‌బ‌రిమ‌ల ఆలయ కమిటీ.. ఏంటో తెలుసా?

అయితే దీనిని ఈ ఏడాది జూన్‌ నెలలో టిక్‌టాక్‌ వేదికగా ఓ సోషల్‌మీడియా స్టార్‌ దీనిని పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దానిని ఉపయోగించి కాజోల్‌ ఇమేజ్‌కు ఇబ్బంది కలిగించేలా ఈ వీడియో చేశారు. అయితే కొత్త టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ పలువురు ఆకతాయిలు ఇలాంటి డీప్‌ ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేయడం అభిమానులను కలవరపెడుతోంది. దీంతో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేశారు. సినీతారలను టార్గెట్‌ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక రష్మిక విషయంలో అమితాబ్‌ బచ్చన్‌, కీర్తిసురేశ్‌, నాగచైతన్య, విజయ్‌ దేవరకొండతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కేంద్ర ఐటీ శాఖ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై రష్మిక సైతం ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తుంటే భయంగా ఉందన్నారు. ఆ ఘటన మర్చిపోక ముందే కాజోల్‌కు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియో తాజాగా వైరల్‌ కావడం సినీ తారలను కలవరపెడుతోంది.

Advertisment
తాజా కథనాలు