Kamineni Srinivas: కైకలూరులో ఎలాంటి దందా జరుగుతుందంటే.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో బీజేపీ అభ్యర్థి కామినేని సంచలనం

కైకలూరు నియోజకవర్గంలో మట్టి దందా జరుగుతోందని బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజల కోరిక మేరకే తాను ఇక్కడ పోటీ చేస్తున్నానన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

New Update
Kamineni Srinivas: కైకలూరులో ఎలాంటి దందా జరుగుతుందంటే.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో బీజేపీ అభ్యర్థి కామినేని సంచలనం

ప్రజల కోరిక మేరకే తాను కైకలూరులో పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి, కూటమి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) అన్నారు. ఆర్టీవీతో ఆయన ఈ రోజు ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కైకలూరులో కూడా అలాంటి పరిస్థితే ఉందన్నారు. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని తన జీవితంలో ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే నాగేశ్వరరావు వాడుతున్న భాష తాను ఎప్పటికీ వాడలేనన్నారు. ఎమ్మెల్యే, ఆయన కొడుకు తప్ప రాష్ట్రంలో ఏ ఒక్కరూ తనను మాట్లాడరన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలకు తెలుసన్నారు.
ఇది కూడా చదవండి: Alleti Maheshwar Reddy: ఆ మంత్రే షిండే.. ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అందుకే తనను మళ్ళీ పోటీ చేయాలని ఎంచుకున్నారన్నారు. నియోజకవర్గంలో మట్టి దందా జరుగుతోందన్నారు. రోజూ 300 లారీలు తిరుగుతున్నాయన్నారు. మన నియోజకవర్గం నుంచి బయటకు మట్టి ఏంటి? అని ప్రశ్నించారు. ఎప్పుడూ లేనట్టు ఇక్కడ కుటుంబ పాలన జరుగుతోందన్నారు. ఎక్కడైనా వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలే అని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టిన వారిపై కేసులు పెట్టడం ఏంటి? ప్రజలకు మాట్లాడే హక్కు లేదా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఆక్వా రంగం అభివృద్ధి చెందాలంటే కరెంట్ రేట్లు తగ్గించాలని, జే టాక్స్ పోవాలన్నారు. అవన్నీ మేము వచ్చాక చేసి చూపిస్తామన్నారు.

నియోజకవర్గంలో ఒక్క క్రేడిబిలిటీ ఉన్న నాయకుడు వచ్చి తాను అవినీతి చేశానని చెప్పినా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. తన గురించి అందరికీ తెలుసన్నారు. నా రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి తీసుకోలేదని నా ఇష్ట దైవం గణపతి పై ప్రమాణం చేస్తున్నానన్నారు. కామినేని శ్రీనివాస్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు