Kadapa: కడపలో తార స్థాయికి చేరిన చెత్త వివాదం.. ఎమ్మెల్యే ఇంటి ముందు..

కడపలో చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి, మేయర్ సురేష్‌ బాబు మధ్య వివాదం తార స్థాయికి చేరింది. టీడీపీ శ్రేణులు తన ఇంట్లో చెత్త వేసి ఆందోళన చేయడంపై మేయర్, వైసీపీ ప్రజాప్రతినిధులు జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్‌ రాజుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.

New Update
Kadapa: కడపలో తార స్థాయికి చేరిన చెత్త వివాదం.. ఎమ్మెల్యే ఇంటి ముందు..

Kadapa: కడపలో చెత్త పన్ను వివాదం తార స్థాయికి చేరింది. మేయర్ సురేష్‌ బాబు, వైసీపీ ప్రజాప్రతినిధులు.. టీడీపీ శ్రేణులపై జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్‌ రాజుకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని వినతి పత్రం అందించారు. టీడీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు.

Also Read: పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి..!

మేయర్ చెత్త పన్ను కలెక్ట్ చేయడంపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం చెత్త పన్ను రద్దు అంటూ నోటి మాటలే చెప్పింది తప్పా.. జీవో విడుదల చేయలేదని ఉద్ఘాటించారు. ఇలా చెత్త పన్నుపై ఎమ్మెల్యే, మేయర్ మధ్య మొదలైన వ్యవహారం వివాదంగా మారింది.

Also Read: అల్లు అర్జున్ కు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?.. పుష్ప పరువు తీసిన జనసేన ఎమ్మెల్యే!

టౌన్‌లో చెత్త సేకరణ చేపట్టకపోతే మేయర్‌ ఇంటి ముందు చెత్త వేయాలని ఎమ్మెల్యే ఇచ్చిన పిలుపుమేరకు టీడీపీ శ్రేణులు మేయర్ ఇంటి ముందు చెత్త వేసి.. చెత్త మేయర్ అంటూ నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఘటనపై మేయర్, వైసీపీ శ్రేణులు నిరసిస్తూ.. టీడీపీ ఆందోళనకారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మాధవి ఇంటి ముందు..ఆందోళన చేసేందుకు వైసీపీ శ్రేణులు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు