Kadapa: కడపలో ముదిరిన చెత్త యుద్ధం.. మేయర్ ఇంట్లో చెత్త వేసి రచ్చ రచ్చ..!

కడపలో చెత్త పన్నుపై యుద్ధం ముదిరుతోంది. మేయర్ సురేష్‌ బాబు ఇంట్లో మహిళలు చెత్త వేసి.. చెత్త మేయర్‌ అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. టౌన్‌లో చెత్త సేకరణ చేపట్టకపోతే మేయర్‌ ఇంటి ముందు చెత్త వేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు మేరకు మహిళలు ఆందోళనకు దిగారు.

New Update
Kadapa: కడపలో ముదిరిన చెత్త యుద్ధం.. మేయర్ ఇంట్లో చెత్త వేసి రచ్చ రచ్చ..!

Kadapa: కడపలో చెత్త పన్నుపై యుద్ధం ముదిరుతోంది. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య చెత్త పన్నుపై వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మేయర్ సురేష్ బాబు చెత్త పన్ను కలెక్ట్ చేయడంపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వం చెప్పినట్లుగా ఇప్పటి వరకు చెత్త పన్ను రద్దు చేస్తూ ఏలాంటి జీవో ఇవ్వలేదని మేయర్ సురేష్ బాబు ఉద్ఘాటించారు. ఇలా చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, మేయర్ సురేష్ బాబు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Also Read: కువైట్‌లో చిక్కుకున్న మరో తెలుగు మహిళ.. !

తాజాగా, మేయర్ సురేష్‌ బాబు ఇంట్లో చెత్త వేసి మహిళలు నిరసన చేపట్టారు. చెత్త మేయర్‌ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. టౌన్‌లో చెత్త సేకరణ చేపట్టకపోతే మేయర్‌ ఇంటి ముందు చెత్త వేయాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె పిలుపు మేరకు టీడీపీ ఆధ్వర్యంలో మహిళలు చెత్తతో పెద్ద ఎత్తున మేయర్ ఇంటివద్దకు చేరుకుని రచ్చ రచ్చ చేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో మేయర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు