kadapa: ఆస్తులన్ని ఆమెకే.. కడప కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌లో సంచలనం

కడపహెడ్ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు ఫ్యామిలీ హత్యల వెనుక రెండో భార్య రమాదేవి ఉన్నట్లు అనుమాలు వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు మరణం అనంతరం రావాల్సిన బెనిఫిట్స్‌, ఉద్యోగం రెండో భార్య రమాదేవికి ఇవ్వాలని బాండ్‌లో కానిస్టేబుల్‌ కోరారు. సొంతూరులో ఉన్న భూమి కూడా రెండో భార్యకు రాసిచ్చిన వెంకటేశ్వర్లు.

kadapa: ఆస్తులన్ని ఆమెకే.. కడప కానిస్టేబుల్‌ సూసైడ్‌ నోట్‌లో సంచలనం
New Update

కడప జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ భార్యాపిల్లల్ని కాల్చి చంపి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కో-ఆపరేటివ్‌ కాలనీలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ.. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గత రెండేళ్లుగా హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వెంకటేశ్వర్‌కు భార్య మాధవి, డిగ్రీ చదువుతున్న లాస్య , పదోతరగతి చదువుతున్న అభిజ్ఞ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే ఆయనకు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు వివాహం కాగా భర్త చనిపోయారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.

రెండో భార్య రమాదేవికి చెందేలా చూడాలని బాండ్

వెంకటేశ్వర్ రాసిన ఓ సూసైడ్‌ నోట్‌ ఒకటి బయటపడింది. రెండో భార్య రమాదేవికి తన మరణానంతరం డిపార్టుమెంట్‌ నుంచి వచ్చే బెనిఫిట్స్‌, జీపీఎఫ్‌.. ఆమె కొడుకు యారాసు నాగలోకేశ్వర్‌రెడ్డికి ఉద్యోగం ఇవ్వాలని వెంకటేశ్వర్లు కోరారు. రమాదేవికి ఇష్టమైతే ఆమెకే ఉద్యోగం ఇవ్వాలన్నారు. హెడ్ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్ రూ.10 విలువ చేసే రెండు బాండు పత్రాలను ఈ ఏడాది జూన్‌ 26నే కొనుగోలు చేశారు. తన మరణాంతరం వర్తించే ఆర్థిక సాయం, కుటుంబ పింఛను తదితరాలను రెండో భార్య రమాదేవికి చెందేలా చూడాలని ఈ బాండ్లపై సూసైడ్ నోట్‌లో రాశారు. తన భార్య మాధవి చనిపోతుంది కాబట్టి ఆమె పాలసీలు కూడా రమాదేవికి వర్తించేలా చూడాలని బాండు పత్రాలపై వెంకటేశ్వర్లు రాశారు. ఇవన్నీ పరిశీలిస్తే వెంకటేశ్వర్‌ పథకం ప్రకారమే ఇదంతా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు వెల్లడించారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు

ఈ ఏడాది జూన్‌ 26న ఈ బాండ్‌ కాగితాన్ని కోనుగోలు చేయగా.. ఆ రోజే అగ్రిమెంట్‌ రాసుకున్నారు. రూ.20 లక్షల విలువ చేసే భూమిని రమాదేవికి విక్రయించినట్లు అగ్రిమెంటు లేఖను కూడా పోలీసులు గుర్తించారు. అందులో మాత్రం ఆమెను నాగేశ్వరరెడ్డి భార్యగానే పేర్కొన్నారు. దీంతో రెండో భార్య రమాదేవిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదే తేదీన వెంకటేశ్వర్లు మరో రూ.10 బాండ్‌ కాగితం కొన్నారు. దీనిపైనే అక్టోబర్‌ 4వ తేదీ వెంకటేశ్వర్‌ సూసైడ్‌ నోట్‌ రాసి వేశారు. కాగా.. ఈ రెండు డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం, ఆర్థిక సమస్యల కారణంగా భార్యాబిడ్డలను కాల్చి వెంకటేశ్వర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హెడ్‌కానిస్టేబుల్‌ కుటుంబం మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ వెల్లడించారు. రమాదేవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామన్నారు.  ఘటనకి ముందు భార్యాపిల్లలకు మత్తుమందు ఇచ్చారా..? లేదా..? ఏమైనా విషప్రయోగం జరిగిందా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి: తిరుపతిలో డబుల్ మర్డర్ కలకలం.. అన్నా చెల్లెళ్లను చంపి ఏం చేశాడంటే..!!

#family-suicide #second-wife-ramadevi #kadapa-head-constable-venkateshwarlu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe