కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరికి రిమాండ్

విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మత్తు పదార్థాల దందా చేస్తున్నారు కేపీ చౌదరి. చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు టచ్లో ఉన్నారని గుర్తించిన పోలీసులు కేపీతో ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతని మొబైల్ ఫోన్ డేటా ఆధారంగా ఎవరెవరు అతనితో చాటింగ్ చేశారు అన్నదానిపై వివరాలు సేకరించి విశ్లేషిస్తున్నారు.

New Update
కబాలి ప్రొడ్యూసర్ కేపీ చౌదరికి రిమాండ్

Kabali producer KP Chaudhary remanded

కోర్టులో హాజరైన సినీ నిర్మాత 

కస్టడీ ముగియటంతో కొకైన్ కేసులో అరెస్ట్ అయిన సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అంతకుముందు అతనికి వైద్య పరీక్షలు జరిపించారు. కబాలీ సినిమా తెలుగు వర్షన్‌కు నిర్మాత అయిన చౌదరి ఇటీవల కొకైన్ అమ్ముతూ కిస్మత్ పూర్ చౌరస్తాలో పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా, చౌదరి నుంచి మత్తు పదార్థాలు కొన్నవారిలో టాలీవుడ్‌కు చెందిన కొందరు సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారుల కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెళ్లడయ్యింది. ఈ క్రమంలో పోలీసులు కోర్టు అనుమతితో అతన్ని కస్టడీకి తీసుకొని విచారించారు. కస్టడీ గడువు ముగియటంతో నేడు జైలుకు రిమాండ్ చేశారు. కాగా, విచారణలో చౌదరి టాలీవుడ్‌కు చెందిన వారితో పాటు మరికొందరి పేర్లు వెల్లడించినట్టు తెలిసింది. వీరికి నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

గోవా నుంచి మత్తు పదార్థాలు

మాదకద్రవ్యాల కేసులో కొకైన్ తో పట్టుబడిన కబాలి నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. గోవా నుంచి  మాదకద్రవ్యాలు తరలిస్తూ కేపీ చౌదరి పోలీసులకు పట్టుబడ్డారు. కేపీ చౌదరిని అరెస్టు చేసిన తర్వాత ఆయనను కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

సెలబ్రిటీలకు వణుకు

చర్లపల్లి జైలులో ఉన్న కేపీ చౌదరిని పోలీసులు రెండు రోజుల విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోవడంతో ఆయనతో సంబంధాలు ఉన్న పలువురు సెలబ్రిటీలకు వణుకు మొదలైంది. 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైల్లో ఉన్న కేపీ చౌదరిని ఉప్పరపల్లి కోర్టు పోలీసుల కస్టడీకి ఇవ్వడానికి అనుమతినిచ్చింది. దీంతో పోలీసులు కేపీ చౌదరిని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు

చౌదరి సంబంధాలపై లోతుగా పోలీసుల ఆరా

గోవా నుండి 100 కొకైన్ ప్యాకెట్లను తెచ్చిన కెపి చౌదరి వద్ద 90 ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పది ప్యాకెట్లు ఎవరికి అమ్మారు అన్న దానిపైన ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ సినీప్రముఖులతో కెపి చౌదరి సంబంధాలపై పోలీసులు లోతుగా ఆరా తీయనున్నారు. ఇప్పటికే కెపి చౌదరి వద్ద ఉన్న నాలుగు సెల్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలోని డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

 వెలుగులోకి కేపీ చౌదరి వ్యవహారం

రోషన్ అనే మాదకద్రవ్యాలు పెడ్లర్‌ను విచారించిన క్రమంలో నిర్మాత కేపీ చౌదరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోవా, హైదరాబాద్‌లో ప్రైవేట్‌ పార్టీలు నిర్వహించిన కేపీ చౌదరి పార్టీలకు వెళ్లిన సెలబ్రిటీలు ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులు ఒక డైరెక్టర్‌తో కేపీ చౌదరి మాదకద్రవ్యాల చాట్‌ను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కేపీ చౌదరిని పోలీసులు కస్టడీకి తీసుకోవడంతో పలువురు సెలబ్రిటీలలో గుబులు నెలకొంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు