KA Paul: 'పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది'..కేఏ పాల్ కామెంట్స్..!

జనసేనాని కలిసేందుకు పార్టీ కార్యాలయంకు వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందంటూ కార్యాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అరగంట పాటు గేట్ బయట వేచి చూశారు. పవన్ లేకపోవడంతో వెనుదిరిగారు.

KA Paul: 'పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది'..కేఏ పాల్ కామెంట్స్..!
New Update

KA Paul: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం కోసం జనసేన కార్యాలయంకు వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్. దాదాపు అరగంట పాటు గేట్ బయట వేచి చూశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయడానికి తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది అంటూ కార్యాలయం సిబ్బంది కి సమాచారం ఇచ్చారు.

Also Read: జగన్ ఇక మాజీ సీఎం.. KA పాల్ శాపనార్థాలు

పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు

తన మాస్టర్ ప్లాన్ వింటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అంటూ జనసేన కార్యాలయం సిబ్బంది తో తెలిపాడు కేఏ పాల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రోజు తనని వత్తిడి చేస్తూ ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని బ్రతిమాలితే కలవడం కోసం వచ్చాను అని తెలిపారు. ఎట్టి పరిస్థితి లో పవన్ కళ్యాణ్ ను కలిసే వెళ్తా అంటూ కారులోనే భీష్మించుకు కూర్చున్నారు. తీరా కార్యాలయంలో పవన్ కళ్యాణ్ లేకపోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లి పోయారు.

అపాయింట్ మెంట్ ఇవ్వని జగన్

ఇదిలా ఉండగా ఇప్పటికే.. సీఎం జగన్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు కేఎ పాల్. ప్రజా సమస్యలపై చర్చించి ఎన్నికల్లో కలసి పనిచేద్దామని చెప్పేందుకు వెళ్లనన్నారు. అయితే, పోలీసులు జగన్ ను కలిసేందుకు అనుమతించలేదు. దీంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మెయిన్ గేటు వద్దే గంట సేపు వేచి చూశారు. అయితే, ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.

అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా..లేదంటే శపిస్తా

ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా..లేదంటే శపిస్తా అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. " ఎంతో మంది దేశాధినేతలు నేను అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం నాకు అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. నాకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారు. మాజీ సీఎం అయ్యాకే కేసీఆర్ నాకు అపాయింట్ మెంట్ ఇచ్చిన పరిస్థితి చూశారు. సీఎం అపాయింట్ మెంట్ కోసం ఇవాల రేపు విజయవాడలోనే ఉండి వేచి చూస్తా.. అపాయింట్మెంట్ ఇస్తే సీఎం తో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తా, రహస్యాలు చెబుతా..నాకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే సీఎం వైఎస్ జగన్ కూడా మాజీ సీఎం అవుతారు" అని కామెంట్స్ చేశారు.

#ka-paul #andhra-pradesh #janasena-pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe