KA Paul: తాటి ముంజలు కొట్టిన కేఏ పాల్.. రాష్ట్రం అప్పులు తీరాలంటే ఇలా చేయండి..!

AP: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాటి ముంజలు కొడుతూ.. కుండ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

New Update
KA Paul: తాటి ముంజలు కొట్టిన కేఏ పాల్.. రాష్ట్రం అప్పులు తీరాలంటే ఇలా చేయండి..!

KA Paul: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ క్రేజ్ అంతా..ఇంతా కాదు. ప్రత్యర్థి ఎవరైనా సరే విమర్శనాస్త్రాలు సంధిస్తూ అందరినీ తన మాటలతో ఎంటర్‌టైన్ చేస్తుంటారు పాల్. ప్రస్తుతం కేఏ పాల్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరో సారి వినూత్నంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: కిరణ్ కుమార్ రెడ్డి.. మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే ఇలా చెయి..!

మొన్న మత్య్సకారుడిలా వేషం కట్టి వారితో కలిసి చేపలు పట్టారు పాల్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎంపీగా తనను గెలిపిస్తే మినీ హార్బర్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకారుల కుటుంబాలను కూడా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

Also Read: మోదీ క్షమాపణ చెప్పాలి.. భారతి స్ట్రాటాజీ అందరినీ గొడ్డలితో చంపడమేనా?

ఈ క్రమంలోనే ఈరోజు కేఏ పాల్ తాటి ముంజలు కొడుతూ.. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కుండ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే తనను విశాఖ ఎంపీగా గెలిపించాలని కోరారు. వైసీపీ, టీడీపీని నమ్ముకుంటే ప్రయోజనం ఏమీ ఉండదని ఓటర్లకు వివరించారు పాల్.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు