/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-4-11.jpg)
Lok sabha: దేశంలో మూడోసారి కోలువుదీరిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వ ఆధ్వర్యంలో 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి మొదలుకానున్నాయి. ఇందులో భాగంగానే జూన్ 26న లోక్‌సభకు నూతన స్పీకర్‌ను ఎన్నుకునే ప్రక్రియ జరగనుండగా... అప్పటి వరకు ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ నేత కె. సురేష్ పేరును ఖరారు చేసినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం కొలువుదీరనున్న18వ లోక్‌సభలో ప్రధాని, మంత్రి మండలి, ఇతర ఎంపీలతో ఆయన ప్రమాణం చేయించనున్నారు. ఇక కేరళలోని మవెలికర నుంచి ఎంపీగా గెలిచిన కె.సురేష్ చాలాకాలంగా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.