Jyothika: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా వీళ్ళిద్దరిది బెస్ట్ పెయిర్ అంటూ చాలా మంది చెబుతుంటారు. సూర్య, జ్యోతిక ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే జ్యోతిక ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ వారిద్దరి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని.. అసలు తాను సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. జ్యోతిక తన 45వ పుట్టిన రోజు సందర్బంగా తమ పెళ్లి నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు.
10 ఏళ్ళ పాటు నేను షూటింగ్స్ బిజీగా షూటింగ్స్ లలో బిజీగా ఉన్నాను. అదే సమయంలో సూర్య నాకు ప్రపోజ్ చేశారు. మా ఇరు కుటుంబాలు మా పెళ్ళికి అంగీకరించాయి దాంతో మేము కూడా ఎక్కువగా ఆలోచించకుండా నెల రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాము అంటూ జ్యోతిక తెలిపింది.
మొదటి సారి నేను, సూర్య కలిసి 'పూవెల్లమ్ కెట్టుప్పర్' సినిమాలో నటించాము. ఆ సమయంలో సూర్య నాతో మామూలుగానే మాట్లాడేవారు. ఆ సినిమా తర్వాత మేమిద్దరం కలిసి ఏడు సినిమాల్లో నటించాము. సినిమాల్లో నటించేటప్పుడు డైరెక్టర్ ఏదైనా రొమాంటిక్ సీన్ చెప్పినప్పుడు అది మాత్రమే నటించేవారు అంతకు మించి ఎక్కువగా ఏమి చేసేవారు కాదు అలాగే దాన్ని అదనుగా అయితే అస్సలు తీసుకునేవారు కాదు. తనలోని ఆ గౌరవం నన్ను ఎంతగానో ఆకర్షించింది. సూర్యను నేను పెళ్లి చేసుకోవడానికి తను నాకు ఇచ్చిన గౌరవమే ప్రధాన కారణం అంటూ తెలిపారు.
అంతే కాదు జ్యోతిక సూర్య పై మరిన్ని ప్రశంశలు కురిపించారు. సూర్య భర్త గానే కాదు తండ్రి గా కూడా చాలా సిన్సియర్. మా జీవితంలో గడిపిన ఎన్నో మధుర క్షణాలను ఆయన మర్చిపోకుండా ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. అలాగే కుటుంబానికి సంబందించిన ప్రతి విషయాన్నీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారని, ఫ్యామిలీ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు అందుకే అయన అంటే నాకు చాలా ఇష్టం అని జ్యోతిక చెప్పుకొచ్చారు.
Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి.. హిట్టా !! ఫట్టా !! ట్విట్టర్‌లో ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే?