సూర్య రియాలిటీని బయటపెట్టిన జ్యోతిక.. అందరిలాగే ఉంటాడంటూ

స్టార్ హీరో, భర్త సూర్యతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది జ్యోతిక. అతడు అందరికీ మర్యాదనిస్తాడు. నా భావాలను కూడా గౌరవిస్తాడు. అందుకే సూర్య ప్రపోజ్ చేయగానే అంగీకరించాను. అతన్ని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

సూర్య రియాలిటీని బయటపెట్టిన జ్యోతిక.. అందరిలాగే ఉంటాడంటూ
New Update

స్టార్ నటుడు, భర్త సూర్య రియాలిటీకి సంబంధించి నటి జ్యోతిక ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ కపుల్స్ ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలుస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కాథల్-ది కోర్‌’ గురువారం ప్రేక్షకుల ముందుకురాగా.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్న జ్యోతిక రీసెంట్ ఇంటర్వ్యూలో చిత్ర వివేషాలతోపాటు సూర్యతో ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్ అయింది.

'ఎవరైనా ప్రేమలో పడటం చాలా సులభం. కానీ ఆ ప్రేమలో ఎదగడాన్ని మాత్రం మరిచిపోకూడదు. మన భాగస్వామిని గౌరవించడం, అభినందించడం దాంపత్య జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ఇది పరస్పర గౌరవం, ప్రశంసలపై ఆధారపడి ఉంటుంది. ఒక బంధంలో ఉన్నప్పుడు చిన్న విషయాలను పట్టించుకోకూడదు' అని చెప్పారు. అలాగే సూర్యతో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘సూర్య, నేను కలిసి ఏడు చిత్రాల్లో నటించాం. అతడు అందరికీ మర్యాదనిస్తాడు. అలాగే నా భావాలకు కూడా గౌరవిస్తాడు. నాకు నచ్చే విషయం అదే. అందుకే సూర్య నాపై ఉన్న ప్రేమను బయటపెట్టగానే అంగీకరించాను. తనను పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై మమ్ముట్టి మాట్లాడుతూ ఏళ్లు గడిచేకొద్ది ప్రేమ మరింత బలపడుతుందని, అది ఒక్కరోజుతో తేలిపోయే విషయం కాదన్నారు.

Also read :‘IFFI’ వేదికపై కన్నీరు పెట్టుకున్న సన్నీ డియోల్.. వాళ్లే తొక్కేశారంటూ

ఇక మమ్ముట్టి సొంత బ్యానర్‌పై వచ్చిన ‘కాథల్-ది కోర్‌’ సినిమాను పలు అరబ్‌ దేశాలు నిషేధించాయి. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయనే కారణంగా తమ దేశాల్లో రిలీజ్ అడ్డుకున్నాయి.

#interesting-facts #jyothika #surya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి