/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kcr-2-jpg.webp)
BRS Chief KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఉహించకని షాక్ తగిలింది. ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్కు నోటీసులు అందాయి. జస్టిస్ నర్సింహా రెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన నోటీసులపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లోపేర్కొన్నారు. కాగా ఇటీవల ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే.
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించింది. అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్లలో గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు ఒక స్పెషల్ జడ్జితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
Notices to former CM #KCR regarding purchase of Chhattisgarh electricity. Justice Narsimha Reddy has given notice to KCR to give an explanation before 30th of this month. pic.twitter.com/JlD1zgHTeY
— Vijay Reddy (@vijay_reports) June 11, 2024