Bike Offer: కేవలం రూ. 56వేలకే కొత్త బైక్ మీ సొంతం..ఈ కిర్రాక్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..!! By Bhoomi 08 Dec 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా. అది కూడా మీ బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్నారా. అయితే మీకోసం ఒక బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. దిగ్గజ టూవీలర్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న హీరో మోటోకార్ప్ కు చెందిన బైక్ ను మీరు తక్కువ ధరకే కొనవచ్చు. ఎలా అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. అందువల్ల మారే అవకాశం ఉంటుంది. ఈ డీల్ ఉన్నప్పుడే మీ సొంతం చేసుకోండి. హీరో మోటొకార్ప్ కు చెందిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ మీకు కావాల్సిన ధరకే లభిస్తుంది. బడ్జెట్ ధరలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్ కార్ట్ లో మీరు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ను కొనవచ్చు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 61,718గా ఉంది. అయితే మీరు ఈ బైక్ ను ఆఫర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారీ డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఇప్పుడు ఈ బైక్ ను రూ. 56, 257కే కొనుగోలు చేయవచ్చు. అంటే మీరు రూ. 5,460 డిస్కౌంట్ వస్తుంది. అయితే మీరు దీనిని ఫ్లిప్ కార్ట్, యాక్సిస్ బ్యాంక్, క్రిడిట్ కార్డు ద్వారా కొంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ ఆఫర్ అనేది కొంతకాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే కొత్త బైక్ కొనాలనే ప్లానింగ్ లో ఉంటే వెంటనే ఈఆఫర్ బుక్ చేసుకోండి. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ నాన్ ఐ3ఎస్ కిక్ స్టార్ట్ మోడల్ కు ఇది పూర్తిగా వర్తిస్తుంది. ఈ రేటు ఎక్స్ షోరూమ్ ధర..మీరు బైక్ ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత డీలర్ మీ దగ్గరకు వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనికి మీరు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీవో, ఇన్సురెన్స్ ఛార్జీలు మీరు పెట్టుకోవల్సి ఉంటుంది. 15రోజుల్లో ఈ పూర్తి పూర్తవుతుంది. తర్వాత మీరు మీ బైక్ ను డీలర్ షిప్ దగ్గరి నుంచి ఇంటికి తెచ్చుకోవచ్చు. అంతేకాదు ఈ బైక్ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంటై కూడా ఉంటుంది. 6 నెలలపాటు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు 10500 చెల్లించాలి. అదే 3 నెలలకు అయితే రూ. 20, 954 చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ. 25వేల డౌన్ పేమెంట్ క కట్టినట్లయితే అప్పుడు ఏడాదిపాటు టెన్యూర్ నెలకు రూ. 3156 చెల్లిస్తే చాలు. ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు ఇది వర్తిస్తుంది. కాగా ఈ బైక్ లీటర్ కు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది కూడా చదవండి: డిగ్రీ ఉత్తీర్ణతతో ఎయిర్ ఇండియాలో 828 ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!! #bike-offer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి