మీరు తక్కువ మొత్తంలో ఎక్కువ డబ్బు పొందాలని చూస్తున్నారా? అయితే మీకోసం బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావిస్తే మీకు ఇది శుభవార్తే. ఎన్నో రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులో డబ్బులు ఎఫ్డీ చేసుకోవచ్చు. లేదంటే ప్రతినెలా ఆర్డీ చేసుకోవచ్చు. లేదంటే ప్రభుత్వం అందించే సేవింగ్ స్కీమ్స్ లో డబ్బులను దాచుకోవచ్చు. ఇలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాబడి పొందవచ్చు. అయితే మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. మీరు ఎంత పెట్టుబడి పెడతారో...దాని ఆధారంగా వచ్చే రాబడి కూడా మారుతుంది. అందుకే మీరు ఎక్కువ పెట్టుబడి పెడితే..ఎక్కువ రాబడి వస్తుంది.
ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు సెలక్ట్ చేసుకునే స్కీమ్ ఆధారంగా మీకు వచ్చే లాభం మారుతుంది. కొన్ని పథకాలు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా స్కీమ్ టెన్యూర్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిలో ఎక్కువ రాబడి వచ్చే ఛాన్స్ ఉంటుంది.ఇలాంటి స్కీమ్స్ లో పీపీఎఫ్ ఒకటి. ఈ స్కీమ్ టెన్యూర్ 15సంవత్సరాలు. మీకు కావాలనుకుంటే 5ఏళ్ల చొప్పున టెన్యూర్ పొడిగించుకోవచ్చు. అందుకే మీకు నచ్చిన కాలం డబ్బులు పెట్టుబడి చేయోచ్చు.
అంతేకాదు ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టడం వల్ల మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఎలాంటి ట్యాక్స్ ఉండదు. పెట్టిన డబ్బులు వచ్చిన వడ్డి, వీత్ డ్రా చేసే మొత్తంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఈ స్కీం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రభుత్వ స్కీం ప్రస్తుతం 7.1 శాతం వడ్డీరేటు ఇస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారం చూస్తే..మీరు పెట్టుబడి చేసే మొత్తానికి మెచ్యూరిటీ సమయంలో ఎంత వరకు ప్రాఫిట్ వస్తుందో చూద్దాం. నెలకు రూ. 1000 పొదుపు చేస్తే 15ఏళ్ల మెచ్యూరిటీ సమయంలో మీ చేతికి 3.2 లక్షలు వస్తాయి. అదే మరో 5ఏళ్లు టెన్యూర్ పొడిగించుకుంటే అప్పుడు చేతికి రూ. 5.3 లక్షల వస్తాయి. ఇంకో 5ఏళ్లే అలాగే పెట్టుబడి చేస్తే చేతికి దాదాపు రూ. 8.2లక్షల వరకు వస్తాయి.
అదేనెలకు రూ. 2వేలు పెట్టుబడి పెడితే మీకు 15ఏళ్ల టెన్యూర్ కు రూ. 6.5లక్షలు వస్తాయి. అదే 20ఏళ్ల వరకు డబ్బులు పెడితే అప్పుడు రూ. 10లక్షలకు పైగా పొందవచ్చు. 25ఏల్లపాటు రోజుకు రూ. 65 పొదుపు చేస్తే రూ. 16లక్షలకు పైగా వస్తాయి. మీకు దగ్గరలో ఉన్న పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోని అందులో చేరండి.
ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుఫాన్ నేపథ్యంలో రైల్వే స్పెషల్ ట్రైన్స్..!!