Jr NTR : ఎన్టీఆర్ కు యాక్సిడెంట్.. టీమ్ కీలక ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ పర్సనల్ టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వార్త నిజం కాదని, తారక్ క్షేమంగా ఉన్నారని అధికారికంగా వెల్లడించింది.

New Update
Jr NTR : ఎన్టీఆర్ కు యాక్సిడెంట్.. టీమ్ కీలక ప్రకటన

Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తమ అభిమాన హీరోకి ఏమైందోనని ఆందోళన చెందారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ పర్సనల్ టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఏ మేరకు ఈ వార్తను ఖండించింది.

Also Read : అతనితో డేటింగ్ రూమర్స్ పై స్పందించిన కృతి

ఆ వార్త నిజం కాదని, తారక్ క్షేమంగా ఉన్నారని అధికారికంగా వెల్లడించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అవ్వడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది.

Advertisment
తాజా కథనాలు