చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) నాటి నుంచి అటు టీడీపీ అభిమానులతో పాటు, ఎన్టీఆర్, నారా కుటుంబాలను అభిమానించే వారిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒకటే. అదే.. జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదు..? అని. ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీకి చెందిన ఓ వర్గం విమర్శలు కూడా చేస్తోంది. కావాలనే ఆయన స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వాదన మాత్రం మరోలా ఉంది. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘ఎన్టీఆర్ (NTR), వైఎస్ఆర్ (YSR) ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. ఈ అంశంపై ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించలేదని పలువురు టీడీపీ అభిమానులు తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానీతో గతంలో ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణమని కూడా ఆ సమయంలో తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: Nara Bhuvaneswari, Brahmani: నెక్స్ట్ టార్గెట్ భువనేశ్వరి, బ్రహ్మణి.. అరెస్ట్ ఖాయమా?
Jr.NTR: చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ మౌనానికి కారణమిదేనా?
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి నేటి వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే.. ఎలా స్పందించినా టీడీపీకి చెందిన కొందరు నేతలు గతంలో ట్రోల్ చేశారని.. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటున్నారని జూనియర్ అభిమానులు వాదిస్తున్నారు.
Translate this News: